July 14, 2026

Nithiin : ఎట్టకేలకు సినిమా మొదలెట్టిన నితిన్

Nithiin : ఎట్టకేలకు సినిమా మొదలెట్టిన నితిన్
Reading Time: < 1 minute
Nithiin New Movie Launched Sithara Entertainments Rithika Nayak

నితిన్ తదుపరి చిత్రం ఎట్టకేలకు లాంఛనంగా ప్రారంభమైంది. ‘తమ్ముడు’ సినిమా ఫలితం తర్వాత కాస్త సుదీర్ఘ విరామం తీసుకున్న ఆయన, ఇప్పుడు మరో ఆసక్తికరమైన ప్రాజెక్టుతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమయ్యారు. ‘సితార ఎంటర్‌టైన్‌మెంట్స్’ ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. ఈ సినిమాతో నారి సిరిసవాడ, సోమశేఖర్ టి దర్శకులుగా ఇండస్ట్రీకి పరిచయం కానున్నారు. బుధవారం జరిగిన పూజా కార్యక్రమంతో ప్రాజెక్ట్‌ను అధికారికంగా ప్రకటించారు. నితిన్ సరసన టాలెంటెడ్ బ్యూటీ రితికా నాయక్ హీరోయిన్‌గా నటిస్తోంది.

ప్రముఖ సంగీత దర్శకుడు సురేష్ బొబ్బిలి ఈ చిత్రానికి స్వరాలు సమకూరుస్తుండగా, అనిత్ మదాడి సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరిస్తున్నారు. జానీ షేక్ ఆర్ట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు. ఒక పర్ఫెక్ట్ టెక్నికల్ టీమ్‌తో దృశ్యపరంగా ఈ సినిమాను అద్భుతంగా మలిచేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా.. శ్రీకర స్టూడియోస్ సమర్పిస్తోంది. ఈ నెల (మే) రెండో వారం నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. ఇందుకు సంబంధించి చిత్ర యూనిట్ ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన మరిన్ని సర్ప్రైజింగ్ వివరాలను మేకర్స్ త్వరలో వెల్లడించనున్నారు.