Reading Time: < 1 minute

జపాన్‌‌‌‌లో మనోళ్లకు కొలువులు ..మంత్రి వివేక్‌‌‌‌ చొరవతో టామ్‌‌‌‌కామ్‌‌‌‌-పోగ్లీ ఒప్పందం

Caption of Image.
  • సచివాలయంలో మంత్రి సమక్షంలో ఎంవోయూ
  • తొలి ఏడాదే 400-500 మందికి ఉద్యోగాలు లక్ష్యం
  • యువత ఎంపిక, స్క్రీనింగ్‌‌‌‌, వీసా ప్రక్రియ టామ్‌‌‌‌కామ్‌‌‌‌దే
  •  జపనీస్‌‌‌‌ భాష, ట్రేడ్‌‌‌‌ స్కిల్స్‌‌‌‌లో ఉమ్మడి శిక్షణ 

హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర యువతకు సురక్షితమైన, పారదర్శకమైన, దీర్ఘకాలిక ఉపాధి అవకాశాలు కల్పించడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని శక్తి, గనుల శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి స్పష్టం చేశారు. జపాన్ సహా ప్రపంచవ్యాప్తంగా నైపుణ్యం కలిగిన మన యువతకు అవకాశాలు కల్పించేలా తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్‌‌‌‌పవర్ కంపెనీ లిమిటెడ్ (టామ్‌‌‌‌కామ్) చర్యలు ముమ్మరం చేస్తున్నదని తెలిపారు. టామ్‌‌‌‌కామ్‌‌‌‌, పోగ్లీ మధ్య కుదిరిన ఎంవోయూతో తొలి ఏడాదిలోనే 400 నుంచి 500 మందికి జపాన్‌‌‌‌లోని కన్సాయ్ రీజియన్‌‌‌‌లో ఉద్యోగాలు కల్పించేలా ప్రణాళికలు సిద్ధం చేసినట్లు చెప్పారు.  

శుక్రవారం సెక్రటేరియెట్ లో మంత్రి వివేక్, శక్తి శాఖ కార్యదర్శి దాసరి హరిచందన సమక్షంలో టామ్‌కామ్, జపాన్ ప్రముఖ సంస్థ ‘పోగ్లీ’ల మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. టామ్‌కామ్ ఎండీ కాంతి వెస్లీ, పోగ్లీ సీఈవో డాక్టర్ కరుణ్ మల్హోత్రా ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. ఈ ఒప్పందం ద్వారా జపాన్‌లో ఉద్యోగావకాశాలను పోగ్లీ గుర్తించనుండగా.. అభ్యర్థుల ఎంపిక, రిజిస్ట్రేషన్, వీసా ప్రక్రియలను టామ్‌కామ్ చేపట్టనుంది.ఈ సందర్భంగా మంత్రి వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ..నైపుణ్యమే కొలమానంగా విదేశీ గడ్డపై మన యువత ఉన్నతమైన కెరీర్‌ను నిర్మించుకోవడానికి ఈ భాగస్వామ్యం ఎంతగానో దోహదపడుతుందని భరోసా ఇచ్చారు. జపాన్ ఉద్యోగాల కోసం ఆసక్తి ఉన్నవారికి టామ్‌కామ్ ఇప్పటికే ముందస్తుగా జపనీస్ భాషా శిక్షణను అందిస్తోంది.  

 

©️ VIL Media Pvt Ltd.