Reading Time: < 1 minute
Kalki2898ad Shoot Resumes From May 4th Prabhas Will Participate In This Schedule From May 4th To 7th

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో దూసుకుపోతున్నారు. ఆయన లైనప్‌లో ఉన్న అత్యంత ప్రతిష్టాత్మకమైన చిత్రాల్లో ‘కల్కి 2898 AD’ సీక్వెల్ కూడా ఒకటి. నాగ్‌ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సైన్స్ ఫిక్షన్ వండర్‌కు సంబంధించి తాజాగా అప్డేట్ బయటకు వచ్చింది. ఈ రోజు నుంచి ఈ సినిమా కొత్త షెడ్యూల్ ప్రారంభం కానుందని ఇందులో ప్రభాస్ కూడా పాల్గొనబోతున్నారని సమాచారం.

గత కొంతకాలంగా హైదరాబాద్‌లోని ఒక భారీ సెట్‌లో ‘కల్కి 2’ చిత్రీకరణ జరుగుతోంది. కొత్త షెడ్యూల్‌లో ప్రభాస్‌ పై ఈ నెల 4 నుండి 7 వరకు కీలకమైన సన్నివేశాలను చిత్రీకరించనున్నట్లు తెలుస్తోంది. అయితే  మొదటి భాగంలో కర్ణ, భైరవగా రెండు విభిన్న పాత్రల్లో అలరించాడు ప్రభాస్. కానీ సీక్వెల్‌లో మాత్రం మరో సరికొత్త లుక్‌లో కనిపించి ప్రేక్షకులను ఆశ్చర్యపరచనున్నారని టాక్ వినిపిస్తోంది. మొత్తంగా.. ఈ సీక్వెల్‌లో ప్రభాస్ పాత్ర మరింత పవర్‌ఫుల్‌గా ఉండబోతోంది. ఇక వైజయంతి మూవీస్ అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ చిత్రంలో దిగ్గజ నటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. అమితాబ్ బచ్చన్ అశ్వత్థామగా తన అద్భుత నటనతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేయనున్నారు. కమల్ హాసన్ సుప్రీం యాస్కిన్‌గా నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో మరింత భయంకరంగా కనిపించనున్నారు. వీరిద్దరికీ, ప్రభాస్‌కు మధ్య వచ్చే సన్నివేశాలు రెండో భాగంలో హైలైట్‌గా నిలవనున్నాయి. ఈ భారీ చిత్రానికి సంతోష్ నారాయణన్ సంగీతాన్ని అందిస్తుండగా.. హాలీవుడ్ స్థాయి విజువల్స్, అద్భుతమైన సెట్టింగ్స్‌తో రూపొందుతున్న‘కల్కి 2’పై ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి.