Reading Time: < 1 minute

ఏపీలో టెన్త్ ఫలితాలు విడుదల.. 85.25 శాతం ఉత్తీర్ణత.. వాట్సాప్ నుంచి రిజల్ట్ ఇలా తెలుసుకోండి..!

Caption of Image.

అమరావతి: ఏపీలో పదో తరగతి పరీక్షా ఫలితాలను ప్రభుత్వం విడుదల చేసింది. మంత్రి నారా లోకేష్ టెన్త్ ఫలితాలను విడుదల చేశారు. టెన్త్‌ ఫలితాల్లో విద్యార్థులు 85.25 శాతం ఉత్తీర్ణత సాధించారు. అబ్బాయిలు 82.68 శాతం ఉత్తీర్ణత సాధించగా, అమ్మాయిలు 87.90 శాతం ఉత్తీర్ణత సాధించారు. ఏపీలో మొత్తం 6 లక్షల మంది విద్యార్థులు పదవ తరగతి పరీక్షలు రాశారు. ఏపీ టెన్త్ ఫలితాలను.. https://results.bse.ap.gov.in వెబ్ సైట్ క్లిక్ చేసి తెలుసుకోవచ్చని మంత్రి నారా లోకేష్ తెలిపారు. అంతేకాకుండా.. వాట్సాప్ నుంచి కూడా ఫలితాలను తెలుసుకోవచ్చని ప్రభుత్వం తెలిపింది.

వాట్సాప్ నుంచి 9552300009 నంబర్కు Hi అని మెసేజ్ చేసి ఏపీ టెన్త్ ఫలితాలను తెలుసుకోవచ్చు. LEAP Mobile Application, DigiLocker నుంచి కూడా ఫలితాలను తెలుసుకోవచ్చని ప్రభుత్వం తెలిపింది. గతేడాది కంటే ఉత్తీర్ణత శాతం పెరిగిందని.. గతేడాది 81.14 శాతం ఉంటే ఈ ఏడాది 85.25 శాతానికి పెరిగిందని మంత్రి నారా లోకేష్ హర్షం వ్యక్తం చేశారు. ప్రభుత్వ స్కూళ్లలో గతేడాది 72.8 శాతం ఉన్న ఉత్తీర్ణత శాతం ఈ సంవత్సరం 78.39 శాతానికి పెరిగిందని మంత్రి నారా లోకేష్ తన ‘ఎక్స్’ ఖాతాలో పోస్ట్ చేశారు.

©️ VIL Media Pvt Ltd.