Reading Time: < 1 minute
Allu Arjun Atlee Raaka Movie Music Sai Abhyankar International Sounding

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, కోలీవుడ్ మాస్ డైరెక్టర్ అట్లీ కలయికలో రూపొందుతున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘రాకా’. ఇటీవల విడుదలైన ఈ సినిమా టైటిల్ పోస్టర్, థీమ్ ట్రాక్ ‘మేక్ వే ఫర్ ది కింగ్’ (Make Way For The King) సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాయి. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కు ‘కావటి’ ఫేమ్ సాయి అభ్యంకర్ సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమా మ్యూజిక్, సౌండింగ్ గురించి సాయి అభ్యంకర్ వెల్లడించిన విషయాలు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి.

Also Read : Sai Pallavi: నాలుగేళ్ల వివాదంపై సాయి పల్లవి ఎమోషనల్ క్లారిటీ..!

సాయి అభ్యంకర్ మాట్లాడుతూ.. ‘ ‘రాకా’ కోసం నేను అట్లీని కలిసినప్పుడే ఈ సినిమా సౌండింగ్ ఎలా ఉండాలో ఆయనకు ఒక స్పష్టమైన విజన్ ఉంది.ఈ సినిమా మ్యూజిక్ కేవలం భారతీయ స్థాయిలోనే కాకుండా, అంతర్జాతీయ ప్రమాణాలకు (International Standards) తగ్గట్టుగా ఉండాలని మేమంతా ఫిక్స్ అయ్యాము. అట్లీ గారు కోరుకున్నట్లుగా నేను సిద్ధం చేసిన థీమ్ ట్రాక్ ఆయనకు, అల్లు అర్జున్ కి ఎంతో నచ్చింది. ప్రతి ట్రాక్‌లోనూ ఒక కొత్త ఫీల్, గ్లోబల్ సౌండింగ్ ఉండేలా మేము శ్రమిస్తున్నాము’ అని సాయి పేర్కొన్నారు.

సంగీతం పట్ల అల్లు అర్జున్‌కు ఉన్న అవగాహన తనను ఆశ్చర్యపరిచిందని సాయి అభ్యంకర్ చెప్పారు. ఐకాన్ స్టార్ క్రేజ్‌కు, అట్లీ మాస్ విజువల్స్ కు తగ్గట్టుగా ఒక కొత్త రకమైన సౌండింగ్‌ను ఈ సినిమాతో పరిచయం చేయబోతున్నట్లు ఆయన ధీమా వ్యక్తం చేశారు. సన్‌ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ భారీ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ డ్రామాలో దీపికా పదుకొణె హీరోయిన్‌గా నటిస్తుండగా, హాలీవుడ్ స్థాయి టెక్నీషియన్లు దీనికి పనిచేస్తున్నారు.