Reading Time: < 1 minute

కోదాడలో ఆర్టీసీ బస్సులో భారీ చోరీ…ప్రయాణికుల నుంచి 15 తులాల బంగారం దొంగలించారు..!

Caption of Image.

సూర్యాపేట జిల్లా కోదాడలో ఆర్టీసీ బస్సులో భారీ చోరీ జరిగింది. బస్సులో వెళ్తున్న ప్రయాణికుల దగ్గర నుంచి 15 తులాల బంగారం ఎత్తుకెళ్లారు గుర్తు తెలియని వ్యక్తులు. బుధవారం ( సెప్టెంబర్ 30 ) జరిగిన ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి.. హుజూర్ నగర్ కు చెందిన తోలునూరి పద్మావతి, సూర్యప్రకాష్ లు 15 తులాల బంగారం ఉన్న బ్యాగుతో కోదాడ నుంచి హుజూర్ నగర్ కు వెళ్లేందుకు ఆర్టీసీ బస్సు ఎక్కారు. మార్గమధ్యలో గుర్తు తెలియని వ్యక్తులు బంగారాన్ని దొంగలించారని చెబుతున్నారు.

మిర్యాలగూడ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు కోదాడ నుండి హుజూర్నగర్ కు వెళ్తుండగా జరిగింది ఈ ఘటన. కోదాడలో రంగా థియేటర్ దగ్గర బస్సు ఎక్కామని.. సుమారు 25 లక్షల విలువజేసే బంగారం చోరీకి గురైందని చెబుతున్నారు బాధితులు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

రూ.25 లక్షల విలువైన బంగారం పోవడంతో కన్నీరు మున్నీరవుతున్నారు బాధితులు. బంగారం లాంటి విలువైన వస్తువులతో ప్రయాణించే సమయంలో జాగ్రత్తగా ఉండాలని..వీలైనంత వరకు సొంత వాహనాల్లో వెళ్లడం మంచిదని సూచిస్తున్నారు పోలీసులు.

©️ VIL Media Pvt Ltd.