Reading Time: 2 minutes
Abhishek Sharma Shines In Asian Games 2026 Takes 2 Wickets Video Goes Viral

ఏషియన్ గేమ్స్‌ 2026 పురుషుల క్రికెట్‌లో భారత్ అదరగొట్టింది. శ్రీలంకతో జరిగిన సెమీఫైనల్‌లో టీమిండియా ఏకంగా 124 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి.. ఫైనల్‌కు దూసుకెళ్లింది. ఈ విజయంతో ఆసియా క్రీడల్లో భారత్‌కు మరో పతకం ఖాయమైంది. స్వర్ణ పతకం కోసం శనివారం జరగనున్న ఫైనల్‌లో దాయాది పాకిస్థాన్‌తో భారత్ తలపడనుంది.

మోస్తరు లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన శ్రీలంక బ్యాటర్లు భారత బౌలర్ల ధాటికి వరుసగా పెవిలియన్‌కు చేరారు. ముఖ్యంగా స్టార్ ఓపెనర్, కాటేరమ్మ కొడుకు అభిషేక్ శర్మ బౌలింగ్‌లో సంచలనం సృష్టించాడు. పదో ఓవర్ వేసిన అభిషేక్.. వరుస బంతుల్లో వికెట్లు పడగొట్టి శ్రీలంక పతనాన్ని మరింత వేగవంతం చేశాడు. 9వ ఓవర్ మూడో బంతికి తిలక్ వర్మ అద్భుతమైన డైరెక్ట్ హిట్‌తో థరిందు రత్నాయకేను రనౌట్ చేశాడు. ఆ తర్వాతి బంతికే సంజు శాంసన్ అద్భుతమైన వికెట్ కీపింగ్‌తో చమిక కరుణరత్నేను స్టంపౌట్ చేశాడు. ఇక ఐదవ బంతికి బినుర ఫెర్నాండోను బౌల్డ్ చేయడంతో అభిషేక్ వరుస బంతుల్లో వికెవికెట్స్ తీశాడు.

అభిషేక్ శర్మ 5 బంతుల్లో రెండు రన్స్ ఇచ్చి రెండు వికెట్స్ పడగొట్టాడు. అభిషేక్ బంతితో చెలరేగడంతో శ్రీలంక ఇన్నింగ్స్ కేవలం 9.5 ఓవర్లలోనే ముగిసింది. లంక 45 పరుగులకే ఆలౌట్ కావడంతో.. భారత్ 124 పరుగుల భారీ తేడాతో విజయాన్ని అందుకుంది. ఈ విజయంతో టీమిండియా ఆసియా క్రీడల పురుషుల క్రికెట్ ఫైనల్‌కు చేరుకుంది. స్వర్ణ పతకాన్ని సాధించాలంటే ఇప్పుడు పాకిస్థాన్‌ను ఓడించాల్సి ఉంటుంది. శనివారం జరగనున్న ఫైనల్‌లో భారత్-పాకిస్థాన్ తలపడనుండటంతో.. మ్యాచ్‌పై భారీ ఆసక్తి నెలకొంది. గత ఆసియా క్రీడల్లో సాధించిన స్వర్ణ పతకాన్ని మరోసారి నిలబెట్టుకోవాలని టీమిండియా లక్ష్యంగా పెట్టుకుంది.