
ప్రపంచవ్యాప్తంగా సంచలనం రేపిన ఫ్లైదుబాయ్ విమాన ఘటనలో హీరో భారత పైలట్ స్మిత్ మచ్చర్ ను ప్రధాని మోదీతో సహా ప్రపంచ నాయకులు ప్రశంసించారు. మచ్చర్ ను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ పొగడ్తలతో ముంచెత్తారు. ఆకాశంలో ఉండగానే కో-పైలట్ దాడికి గురై తీవ్రంగా గాయపడిన స్మిత్ మచ్చర్‌ను ట్రంప్ హీరోగా అభివర్ణించారు. ప్రయాణికులను రక్షించేందుకు తీవ్ర గాయాలతో కూడా ఆయన వ్యవహరించిన తీరును ప్రశంసించారు. అదే సమయంలో దాడికి పాల్పడిన కో-పైలట్‌పై ట్రంప్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అతను ‘బహుశా ఉగ్రవాది అయి ఉండొచ్చు.. లేదా పిచ్చివాడు అయి ఉండొచ్చు’’ అని అన్నారు. అంతకుముందు ప్రధాని మోదీ, నెతన్యాహు లు X వేదిక భారత పైలట్ స్మిత్ మచ్చర్ ను ప్రశంసించారు.
ఇజ్రాయెల్ వెళ్తున్న ఫ్లైదుబాయ్ విమానంలో జరిగిన కత్తిపోట్లు తీవ్ర కలకలం రేపాయి. దుబాయ్ నుంచి టెల్ అవీవ్‌కు బయల్దేరిన విమానంలో కో-పైలట్ తన సహచరుడు, భారత కెప్టెన్ స్మిత్ మచ్చర్‌పై కత్తితో దాడి చేశాడు. విమానం ఆకాశంలో ఉండగానే ఈ ఘటన జరిగింది. ఘటన సమయంలో విమానం వేల అడుగుల మేర కిందకు పడిపోవడంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. అనంతరం విమానాన్ని దారి మళ్లించి సౌదీ అరేబియాలో సురక్షితంగా ల్యాండ్ చేశారు.
తీవ్రంగా గాయపడినప్పటికీ పైలట్ మచ్చర్ కాక్‌పిట్ తలుపు తెరిచి సహాయం కోసం అరవడంతో ప్రయాణికులు, సిబ్బంది కాక్‌పిట్‌లోకి ప్రవేశించి దాడి చేసిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు.
ఎవరీ మచ్చర్..
స్మిత్ మచ్చర్‌కు వాణిజ్య విమానయానంలో 13 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఆయనకు సుమారు 9వేల750 గంటల ఫ్లయింగ్ అనుభవం ఉండగా, ఎక్కువగా బోయింగ్ 737 విమానాలను నడిపారు. గతంలో స్పైస్‌జెట్‌లో సుమారు 11 ఏళ్లపాటు లైన్ ట్రైనింగ్ కెప్టెన్‌గా పనిచేశారు. ఘటన క్రమంలో విమానయాన భద్రతా విధానాలను అధికారులు సమీక్షిస్తున్నారు. ప్రస్తుతం అమెరికాపై ఎలాంటి విశ్వసనీయమైన ముప్పు లేదని యూఎస్ హోంల్యాండ్ సెక్యూరిటీ అధికారులు తెలిపారు.
BREAKING: President Trump says the co-pilot who allegedly stabbed the captain of an Israel-bound Flydubai jet was “perhaps a terrorist or perhaps a whack job.”
Trump says the badly wounded captain still managed to open the cockpit door and scream for help.
“In a way he was a… pic.twitter.com/osmdBm0tSp
— Fox News (@FoxNews) September 30, 2026