
రాజస్థాన్‌లోని జైపుర్‌లో ఉన్న రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్ (RRC)- నార్త్ వెస్ట్రన్ రైల్వే (NWR) భారీ అప్రెంటిస్ శిక్షణకు అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. నార్త్ వెస్ట్రన్ రైల్వే పరిధిలోని వివిధ వర్క్‌షాప్‌లు, యూనిట్లలో 2,008 యాక్ట్ అప్రెంటిస్ ఖాళీలను భర్తీ చేయనున్నారు. అర్హత కలిగిన అభ్యర్థులు అక్టోబర్ 7, 2026 నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ అప్రెంటిస్ పోస్టులను నార్త్ వెస్ట్రన్ రైల్వే పరిధిలోని పలు డివిజన్లు, వర్క్‌షాప్‌లలో భర్తీ చేయనున్నారు. ఎలక్ట్రికల్, కార్పెంటర్, పెయింటర్, మేసన్, ఫిట్టర్, డీజిల్ మెకానిక్, వెల్డర్, మెకానికల్, డీజిల్ మెకానికల్, ఎలక్ట్రీషియన్, మెషినిస్ట్, ఎలక్ట్రానిక్ మెకానిక్, COPA తదితర ట్రేడ్లలో అప్రెంటిస్ అవకాశాలు ఉన్నాయి.
ఏయే యూనిట్లలో ఖాళీలు?
- డివిజనల్ రైల్వే మేనేజర్ ఆఫీస్ (అజ్‌మేర్)
- డివిజనల్ రైల్వే మేనేజర్ ఆఫీస్ (బికనీర్)
- డివిజనల్ రైల్వే మేనేజర్ ఆఫీస్ (జైపుర్)
- డివిజనల్ రైల్వే మేనేజర్ ఆఫీస్ (జోధ్‌పుర్)
- బీటీసీ క్యారేజ్ (అజ్‌మేర్)
- బీటీసీ లోకో (అజ్‌మేర్)
- క్యారేజ్ వర్క్స్ షాప్ (బికనీర్)
- క్యారేజ్ వర్క్స్ షాప్ (జోధ్‌పుర్)
- అందుబాటులో ఉన్న ట్రేడ్లు
అభ్యర్థులు కనీసం 50 శాతం మార్కులతో పదో తరగతి లేదా దానికి సమానమైన పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి. అదనంగా సంబంధిత ట్రేడ్‌లో NCVT/SCVT జారీ చేసిన నేషనల్ ట్రేడ్ సర్టిఫికెట్ (NTC) కలిగి ఉండాలి. 2026 నవంబర్ 6 నాటికి 15 నుంచి 24 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. రిజర్వేషన్ వర్గాలకు నిబంధనల ప్రకారం వయోసడలింపు ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు, ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్ల సడలింపు వర్తిస్తుంది. ఈ అర్హతలు కలిగిన వారు ఆన్‌లైన్ విధానంలో నవంబర్ 6, 2026వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్ దరఖాస్తుకు జనరల్ అభ్యర్ధులు రూ.100 చొప్పున రుసుము చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు నుంచి మినహాయింపు ఉంటుంది. ఎలాంటి రాత పరీక్ష లేకుండానే అభ్యర్థులను మెట్రిక్యులేషన్, ఐటీఐలో సాధించిన మార్కుల ఆధారంగా రూపొందించే మెరిట్, అనంతరం డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ద్వారా ఎంపిక చేస్తారు. అర్హత ఉన్న అభ్యర్థులు చివరి తేదీ వరకు వేచి ఉండకుండా ముందుగానే దరఖాస్తు చేసుకోవడం మంచిది. దరఖాస్తు ప్రక్రియ, ట్రేడ్ వారీగా ఖాళీలు, రిజర్వేషన్, ఇతర నిబంధనల కోసం ఈ కింది RRC/North Western Railway అధికారిక నోటిఫికేషన్‌ను చెక్ చేయండి.
ముఖ్యమైన తేదీలు
- ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభ తేదీ: అక్టోబర్ 7, 2026 నుంచి
- ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: నవంబర్ 6, 2026 వరకు
- వయస్సు లెక్కించే తేదీ: నవంబర్ 6, 2026వ తేదీ నాటికి సరిపడా వయసు ఉండాలి.