
హైదరాబాద్,వెలుగు: ఏనుగు దంతాల స్మగ్లింగ్, అమ్మకాలపై డైరెక్టరేట్ ఇంటెలిజెన్స్ నజర్ పెట్టింది. ఏపీ, తెలంగాణ సహా ఇతర రాష్ట్రాల అడవుల నుంచి ఏనుగు దంతాలను అక్రమంగా తరలిస్తున్న ముఠాను గురువారం అరెస్ట్ చేసింది. ఏనుగు దంతాలను విక్రయిస్తున్నారనే సమాచారంతో హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో నిఘా పెట్టింది. కొనుగోలు చేస్తామని నమ్మించి స్మగ్లర్లను ట్రాప్ చేసింది. జూబ్లీహిల్స్ దంతాలు అమ్మేందుకు వచ్చిన ముగ్గురిని అరెస్ట్ చేసి 17 కిలోల బరువు గల ఏనుగు దంతాలను స్వాధీనం చేసుకుంది. ఏనుగు దంతాలను ఎక్కడి నుంచి హైదరాబాద్ తరలించారనే కోణంలో వివరాలు రాబడతున్నారు.