
‘దసరా’ సినిమాతో శ్రీకాంత్ ఓదెల దర్శకుడిగా పరిచయమయ్యారు. తొలి సినిమాతోనే తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ‘నేచురల్ స్టార్’ నాని, మహానటి కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన దసరా సూపర్ హిట్ అయింది. అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన రావడంతో.. శ్రీకాంత్ ఓదెలపై టాలీవుడ్‌లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. దీంతో ఆయన తదుపరి సినిమా ‘ది ప్యారడైజ్’పై ముందు నుంచే ఆసక్తి నెలకొంది.
భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ది ప్యారడైజ్ చిత్రం ఇటీవల రిలీజ్ కాగా.. మొదటి షో నుంచే డివైడ్ టాక్ తెచుకుంది. ముఖ్యంగా కథ, ఎగ్జిక్యూషన్ విషయంలో ప్రేక్షకుల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. దాంతో తొలి సినిమా దసరాతో ఫుల్ క్రేజ్ సంపాదించుకున్న శ్రీకాంత్ ఓదెలకు ప్యారడైజ్ బిగ్ షాక్ ఇచ్చింది. ప్యారడైజ్ ఫలితంతో సోషల్ మీడియాలో ఓ ఆసక్తికర చర్చ మొదలైంది. స్టార్ హీరోలు, భారీ బడ్జెట్ ప్రాజెక్టులను శ్రీకాంత్ మేనేజ్ చేయగలడా? అని నెటిజెన్స్ చర్చించుకుంటున్నారు.
‘మన శంకర వరప్రసాద్’ సినిమాతో చాన్నాళ్లకు ఓ డీసెంట్ హిట్ కొట్టిన ‘మెగాస్టార్’ చిరంజీవితో శ్రీకాంత్ ఓదెల ఓ సినిమాను ఇప్పటికే ప్రకటించారు. అయితే ది ప్యారడైజ్ రిలీజ్ తర్వాత ఈ ప్రాజెక్ట్‌పై సందేహాలు మొదలయ్యాయని తెలుస్తోంది. ఇప్పుడు అసలు ప్రశ్న ఒక్కటే.. శ్రీకాంత్ ఓదెలపై నమ్మకం పెట్టుకుని సినిమా చేయబోయే స్టార్ ఎవరు?. చూడాలి మరి శ్రీకాంత్ నెక్ట్స్ ఏ హీరోతో, ఎలాంటి సినిమా చేస్తారో.