
ఓటర్ల జాబితా సవరణ కోసం చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ వివాదం నేపథ్యంలో ప్రధాన ఎన్నికల కమిషన్(CEC) జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ, కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) ఈరోజు ముంబైలోని శివాజీ పార్కులో నిరసన చేపడుతోంది. ఈ నిరసనకు వందలాది మంది నిరసనకారులు హాజరయ్యారు. సీజేపీ కన్వీనర్ అభిజిత్ దీప్కే, కోకన్వీనర్లు అశుతోష్ రాంకా, సౌదవ్ దాస్ హాజరయ్యారు.
ఇదిలా ఉంటే, ఈ సీజేపీ ఆందోళనకు వ్యతిరేకంగా ముంబైలో పెద్ద ఎత్తున నిరసనలు చెలరేగుతున్నాయి. పలువురు సీజేపీ ఆందోళల్ని తప్పుపడుతున్నారు. స్థానికంగా శివాజీ పార్క్ వద్ద ఉండే నివాసితులు ఈ నిరసనల్ని వ్యతిరేకిస్తున్నారు. తమ వ్యాపారాలు, పనులు దెబ్బతింటాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. శివాజీ పార్క్ ప్రాంతంలో నిరసనలు నిర్వహించడం వల్ల ట్రాఫిక్ రద్దీ, శబ్దం, రాకపోకలకు ఇబ్బందులు, అత్యవసర వాహనాల రాకపై ప్రభావం వంటి సమస్యలు ఎదురవుతాయని కొందరు నివాసితులు పేర్కొన్నారు.
ఇదిలా ఉంటే, “జెన్ నెక్స్ట్ ముంబై” గ్రూప్ సీజేపీకి వ్యతిరేకంగా నిరసన ప్రదర్శన నిర్వహించింది. సీజేపీ, అభిజిత్ దీప్కే రాజ్యాంగాన్ని కూల్చివేయడం గురించి మాట్లాడుతున్నారని, రాజ్యాంగాన్ని పరిరక్షించడానికి తమ గ్రూప్ శాంతియుత ప్రదర్శన చేస్తున్నామని చెప్పారు. దీప్కే, సీజేపీ యువతను తప్పుదారి పట్టిస్తున్నారని, వారు ఆప్, అరవింద్ కేజ్రీవాల్‌ల ‘టీమ్ బి’ అని నిరసనకారులు ఆరోపించారు. ఆ బృందం డిమాండ్లు రాజ్యాంగ విరుద్ధమని, చట్టవిరుద్ధమని వారు పేర్కొన్నారు.
#WATCH | Maharashtra: A group of people identifying themselves as members of “Gen next Mumbai” holds a protest against the Cockroach Janata Party in Mumbai pic.twitter.com/pCHBDhr5Zs
— ANI (@ANI) October 2, 2026