Reading Time: 2 minutes
Christa Pike Survives Two Lethal Injection Doses In Failed Tennessee Execution

USA: అమెరికా టెన్నెస్సీలో జరిగిన ఓ ఘటన ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఒక హత్య కేసులో మహిళకు మరణశిక్ష అమలు చేస్తే, ఆమె ఎంతకూ మరణించకపోవడం సంచలనంగా మారింది. ఇప్పుడు జైలు అధికారులు ఆమె ప్రాణాలు కాపాడేందుకు చికిత్స అందించాల్సి వస్తోంది. గంట పాటు సాగిన ఈ ప్రక్రియ తర్వాత కూడా ఆమె శ్వాస తీసుకుంటూనే ఉండటంతో మరణశిక్ష అమలు ప్రక్రియను నిలిపేసి ఆస్పత్రికి తరలించారు.

క్రిస్టా పైక్ అనే మహిళ సహవిద్యార్థిని కొలీన్ స్లెమ్మర్‌ను హత్య చేసిన కేసులో దోషిగా తేలింది. ఈ హత్య క్రిస్టా పైక్‌కు 18 ఏళ్లు ఉన్న సమయంలో 1955లో జరిగింది. ఈ హత్య కేసులో ఆమెకు మరణశిక్ష విధించారు. సెప్టెంబర్ 30, 2026న టెన్నెస్సీలో ఆమెకు మరణశిక్ష ఖరారైంది. ఈ శిక్ష అమలైతే సుమారుగా 2 దశాబ్దాల తర్వాత టెన్నెస్సీలో మరణశిక్ష పడుతున్న తొలి మహిళగా ఆమె నిలిచేది.

అసూయతో హత్య..

పైక్ తన సహవిద్యార్థి కొలీన్ స్లెమ్మర్ తన బాయ్‌ఫ్రెండ్‌తో సన్నిహితంగా ఉంటుందనే కోపంతో నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి హత్య చేసింది. ఈ హత్య కేసులో ఆమెకు ఫస్ట్ డిగ్రీ మర్డర్, కుట్ర ఆరోపణల్లో మరణశిక్ష ఖరారైంది. పైక్ మరణశిక్షపై పైకోర్టులకు అప్పీల్ చేసినప్పటికీ తిరస్కరించాయి.

ప్రాణాంతక ఇంజెక్షన్ 2-సార్లు ఇచ్చినా చావలేదు..

మరణశిక్ష అమలులో భాగంగా సెప్టెంబర్ 30 రాత్రి రివర్‌బెండ్ మ్యాక్సిమమ్ సెక్యూరిటీ ఇన్‌స్టిట్యూషన్‌లో ప్రాణాంతక ఇంజెక్షన్ ఇచ్చారు. మొదట ఐవీ ద్వారా శరీరంలోకి మందును ఎక్కించారు. మొదటగా పెంటోబార్బిటాల్ తొలి డోస్ ఇచ్చారు. కానీ పైక్ స్పందన పూర్తిగా ఆగలేదు. ఆ తర్వాత రెండో డోస్ ఇచ్చారు. అయినప్పటికీ ఆమె గుండె కొట్టుకోవడం, శ్వాస కొనసాగించడం ఆగలేదు. మీడియా, న్యాయవాదులకు ఆమె ఇంకా చనిపోలేదని మైక్రోఫోన్ శబ్దాల ద్వారా తెలిసింది. దీంతో ఆమెను ఆస్పత్రికి తరలించారు.

పైన్ న్యాయవాదులు ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు చెబుతున్నారు. లైఫ్ సపోర్ట్‌పై చికిత్స అందిస్తున్నారు. ఆమె మెదడుకు ఆక్సిజన్ కొరత కారణంగా మెదడుకు నష్టం జరిగి ఉండొచ్చని భావిస్తున్నారు.

ఇంజెక్షన్ ఎందుకు విఫలమైంది.?

ఇంజెక్షన్ రెండు డోసులు ఇచ్చినా ఎందుకు ఆమె మరణించలేదనేది స్పష్టంగా తేలలేదు. మందు పూర్తిగా రక్తంలోకి చేరకపోవడం, ఐవీ సంబంధిత సమస్య కారణంగా ప్రభావం చూపించలేదని అనుమానిస్తున్నారు. ఇప్పుడు టెన్నెస్సీ గవర్నర్ బిల్ బీ ఈ మరణశిక్షపై స్వతంత్ర సమీక్షకు ఆదేశించారు.

ఇంజెక్షన్ ఎలా పనిచేస్తుంది.?

పెంటోబార్బిటాల్ అనే ప్రాణాంతక ఇంజెక్షన్ నాడీ వ్యవస్థపై పనిచేస్తుంది. దీనిని ప్రధానంగా వైద్యంలో మత్తు, నిద్ర, మూర్చ నియంత్రణలకు వాడుతారు. అధిక మోతాదులో ఇస్తే ఇది శ్వాస, గుండె పనితీరుపై ప్రభావం చూపించి మరణానికి కారణమవుతుంది. అమెరికాలోని కొన్ని రాష్ట్రాల్లో మరణశిక్ష విధించేందుకు ఇచ్చే ప్రాణాంతక ఇంజెక్షన్‌లో పెంటోబార్బిటాల్‌ను ఉపయోగిస్తున్నారు. ఇది ఖైదీని పూర్తిగా అపస్మారక స్థితిలోకి తీసుకెళ్లి, ఆ తర్వాత శరీరం కీలక విధుల్ని ఆపేలా చేసి, మరణం సంభవించేలా చేస్తుంది.