
నేచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘ది ప్యారడైజ్’ సెప్టెంబర్ 24న థియేటర్లలోకి వచ్చింది. సినిమాకు మిక్స్‌డ్ టాక్ వచ్చినప్పటికీ బాక్సాఫీస్ దగ్గర మాత్రం మంచి వసూళ్లతో దూసుకెళ్తోంది. మరోవైపు రిలీజ్ తర్వాత నాని, శ్రీకాంత్ ఓదెల వరుస ఇంటర్వ్యూలతో సినిమాను మరింత ప్రమోట్ చేస్తున్నారు. మేడారం సమ్మక్క–సారలమ్మ, విజయవాడ కనకదుర్గమ్మ దర్శనాలతోనూ మూవీ టీమ్ వార్తల్లో నిలుస్తోంది. ఈ క్రమంలో ‘ది ప్యారడైజ్’ ఓటీటీ రిలీజ్‌పై ఆసక్తికరమైన టాక్ బయటకు వచ్చింది. ఇప్పటికే ఈ సినిమా ఓటీటీ హక్కులను నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకున్నట్లు సమాచారం. మరి థియేట్రికల్ రన్ తర్వాత నాని సినిమా ఎప్పటి నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది? ప్రస్తుతం వినిపిస్తున్న టాక్ ఏంటి? అనేది చూద్దాం..
OTT స్ట్రీమింగ్ ఎప్పటి నుంచంటే?
ప్రస్తుతం థియేటర్లలో ‘ది ప్యారడైజ్’ రన్ అవుతుంది. అయితే, అన్నిచోట్లా కాకుండా కొన్ని ప్రధాన థియేటర్లో సినిమా సక్సెస్ ఫుల్ గా లాంగ్ రన్ కొనసాగిస్తోంది. ఈ క్రమంలోనే సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ గురించి అప్డేట్ బయటకు రావడంతో.. థియేటర్లో మిస్ అయినవారు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
‘ది ప్యారడైజ్’ మూవీ థియేట్రికల్ రన్ పూర్తైన తర్వాత నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. అయితే ఇప్పటివరకు మేకర్స్ లేదా నెట్‌ఫ్లిక్స్ అధికారికంగా ఓటీటీ స్ట్రీమింగ్ తేదీని ప్రకటించలేదు. అయితేమ్ సాధారణంగా సినిమాలు థియేటర్లలో విడుదలైన 6 నుంచి 8 వారాల తర్వాత ఓటీటీలోకి వస్తుంటాయి. ఆ లెక్కన సెప్టెంబర్ 24న థియేటర్లలో రిలీజైన ‘ది ప్యారడైజ్’.. నవంబర్ ఫస్ట్ వీక్ నుంచి మూడో వారం మధ్య నెట్‌ఫ్లిక్స్‌లోకి వచ్చే అవకాశం ఉందనే టాక్ వినిపిస్తోంది. అంటే నవంబర్ 5 నుంచి 19 మధ్యలో ఏదైనా తేదీలో ఓటీటీలో సందడి చేయనుందని తెలుస్తోంది. అయితే, స్ట్రీమింగ్ డేట్ విషయంలో మేకర్స్ నుంచి క్లారిటీ రావాల్సి ఉంది.
►ALSO READ | Movie Review: చిన్నపిల్లలకు ఈ వీకెండ్ మంచి ఛాయిస్ అవుతుందా? ఫహాద్ ఫాజిల్ ఫాంటసీ మూవీ ఎలా ఉందంటే?
#TheParadise continues its blockbuster run in the 2nd week 💥💥🥁
4 MILLION+ TICKETS SOLD on BookMyShow and District Apps ❤🔥❤🔥
Book your tickets now!
🎟️ https://t.co/XTkG9ueWdvNatural Star @NameisNani in an @odela_srikanth cinema ❤️🔥
An @anirudhofficial musical 🎼… pic.twitter.com/cExKX6hqar— SLV Cinemas (@SLVCinemasOffl) October 2, 2026
రూ.200 కోట్ల గ్రాస్ మార్క్ దిశగా…
శ్రీకాంత్ ఓదెల- నాని కాంబినేషన్‌లో తెరకెక్కిన ఈ యాక్షన్ చిత్రం బాక్సాఫీస్ వద్ద మిక్స్‌డ్ టాక్ సొంతం చేసుకున్నప్పటికీ.. వసూళ్ల పరంగా మాత్రం మంచి జోరు కొనసాగిస్తోంది. ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా రూ.180 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టినట్లు సినీ వర్గాల సమాచారం. తొలి రోజే రూ.80 కోట్లకు పైగా వసూళ్లు సాధించి.. నాని కెరీర్‌లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్‌గా నిలిచిన ఈ చిత్రం ప్రస్తుతం రూ.200 కోట్ల గ్రాస్ మార్క్ దిశగా దూసుకెళ్తోంది. ప్రస్తుతం సెకండ్ వీక్‌లోనూ ‘ది ప్యారడైజ్’కు టికెట్లు బుక్ అవుతున్నాయి.