Reading Time: 2 minutes

Free OTT Movies: మైండ్ బ్లాకింగ్ ట్విస్టులతో మూడు సినిమాలు.. రూపాయి ఖర్చు లేకుండా ఫ్రీగా స్ట్రీమింగ్ ఎక్కడంటే!

Caption of Image.

మలయాళీ సినిమాలంటేనే కంటెంట్‌కు కేరాఫ్ అడ్రస్. స్టార్ డమ్ కంటే సబ్జెక్ట్‌కే ప్రాధాన్యమిచ్చే ఈ విభిన్న కథాచిత్రాలకు తెలుగు ఆడియెన్స్‌లోనూ భారీ క్రేజ్ ఉంది. అయితే, ప్రతిసారీ కొత్త సినిమాలు చూడాలంటే ఓటీటీ సబ్‌స్క్రిప్షన్ల కోసం జేబులు ఖాళీ చేసుకోవాల్సిందే అని ఫీల్ అయ్యే సినీ ప్రియులకు ‘థియేటర్ ప్లస్’ (Theater Plus) సంస్థ ఊహించని ధమాకా ఆఫర్ ప్రకటించింది. రూపాయి ఖర్చు లేకుండా, ఎలాంటి సబ్‌స్క్రిప్షన్ ఫీజు ,హిడెన్ ఛార్జీలు లేకుండా నాణ్యమైన కంటెంట్‌ను ఉచితంగా అందించేందుకు ముందుకు వచ్చింది.

ఈ వారం ఓటీటీ లవర్స్ మైండ్ బ్లాక్ అయ్యేలా ఏకంగా మూడు మలయాళీ హిట్ చిత్రాలను ట్రిపుల్ థ్రిల్కాన్సెప్ట్‌‌తో ప్రేక్షకుల ముందుకు తీసుసొస్తోంది. థియేటర్లలో మెప్పించిన మూడు విభిన్న జానర్లలో సాగే  సినిమాల వివరాలను వెల్లడించింది.

గుమాస్తా (Gumastha) 
ఇది ఒక లీగల్ మైండ్ గేమ్ థ్రిల్లర్. చట్టంలోని లూప్‌హోల్స్ కొట్టిన పిండిలా తెలిసిన ఒక తెలివైన లాయర్ క్లర్క్ కథ ఇది. తన భార్య అనుమానాస్పదంగా మరణించడంతో, అతనే ప్రధాన ముద్దాయిగా బోనులో నిలవాల్సి వస్తుంది. పోలీసులకు, అతనికి మధ్య పిల్లి-ఎలుకలా సాగే ఈ హై-వోల్టేజ్ మైండ్ గేమ్ ప్రేక్షకులను సీటు అంచున కూర్చోబెడుతుంది. క్లైమాక్స్‌లో వచ్చే ఊహించని ట్విస్టులు దిమ్మతిరిగే షాక్ ఇస్తాయి.

►ALSO READ | రైల్వే వ్యవస్థ వెనుక ఉన్న నల్లటి చరిత్ర ఇదే.. బ్రిటీషర్ల అసలు నైజం బయటపెట్టిన విజయ్-రష్మిక!

4 వసంతాలు (4 Vasanthalu) 
హృదయాన్ని తాకే ప్రేమకథా చిత్రం. నాలుగేళ్ల కాలేజ్ లైఫ్, కళ్లముందు కదిలే మధురమైన అనుభూతులు, హృదయాన్ని పిండేసే బ్రేకప్ పెయిన్‌తో సాగే ప్యూర్ లవ్ స్టోరీ. కాలేజ్ ముగిసే సమయానికి ఈ జంట ప్రేమకథలో ఎదురయ్యే ఊహించని మలుపులు ప్రతి ఒక్కరినీ తమ గత జ్ఞాపకాల తీరానికి తీసుకెళ్తాయి.

జై గణేష్ (Jai Ganesh) 
నరాలను తెగే ఇన్వెస్టిగేషన్ డ్రామా తో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఒక చిన్నారి కిడ్నాప్ మిస్టరీ చుట్టూ తిరిగే ఈ క్రైమ్ థ్రిల్లర్ క్షణక్షణానికి తీవ్ర ఉత్కంఠను రేకెత్తిస్తుంది. అడుగుడుగునా మైండ్ బ్లాకింగ్ ట్విస్టులు, నేరస్థుడిని పట్టుకోవడానికి సాగే చాకచక్యమైన శోధన థ్రిల్లర్ లవర్స్‌‌కు విపరీతంగా నచ్చుతుంది. ఈ వీకెండ్‌లో రూపాయి ఖర్చు లేకుండా, ఇంట్లోనే కుటుంబంతో కలిసి ఎంజాయ్ చేయడానికి ‘థియేటర్ ప్లస్’ సిద్ధమైంది. ఈ సస్పెన్స్, ఎమోషనల్ అండ్ క్రైమ్ రైడ్‌ను ఉచితంగా ఆస్వాదించవచ్చని తెలిపింది.

©️ VIL Media Pvt Ltd.