Reading Time: 2 minutes
Hanuman Ansh: 2 కోట్లతో తీస్తే 400 కోట్లు.. తెలుగులోకి  బ్లాక్ బస్టర్ మూవీ ‘హనుమాన్ అంశ్.. అధికారిక ప్రకటన

ఇండియాలో ఈ ఏడాది బాక్సాఫీస్ వద్ద అత్యంత విజయవంతమైన లాభదాయకమైన నిలిచిన సినిమా ‘హనుమాన్ అంశ్’. ఇప్పటికే విజయవంతంగా 50 రోజులు పూర్తి చేసుకున్న ఈ సినిమా ఎనిమిదో వారంలోనూ రికార్డు కలెక్షన్లు సాధిస్తుంది. ఈ నేపథ్యంలో రికార్డుల పరంగా ఇప్పటికే ఈ సినిమా కొత్త మైలురాళ్లను నెలకొల్పింది. భారతీయ సినిమా చరిత్రలో అత్యధిక వసూళ్లు సాధించిన టాప్ 50 చిత్రాల జాబితాలో ‘హనుమాన్ అంశ్’ అధికారికంగా చేరింది. కేవలం కలెక్షన్లే కాదు సినీ ప్రముఖులు, విమర్శకుల ప్రశంసలు అందుకున్న ఈ చిత్రాన్ని తెలుగులోనూ చూడాలని చాలా మంది అనుకుంటున్నారు. ఇప్పుడు వీరి నిరీక్షణకు తెరపడింది. హనుమాన్ అంశ్ చిత్రం తెలుగులో విడుదలకు సిద్ధమైంది. అక్టోబర్‌ 9న ప్రపంచవ్యాప్తంగా ఈ బ్లాక్ బస్టర్ మూవీ రిలీజ్ కానుంది. ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. కాగా మొదట సెప్టెంబర్‌ 18నే హనుమాన్ అంశ్ సినిమాను తెలుగులో విడుదల చేయాలని భావించారు. ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్‌ ఈ సినిమా బాధ్యతలను తీసుకున్నట్లు కూడా ప్రకటించారు. అయితే ఏమైందో తెలియదు కానీ ఈ సినిమా రిలీజ్ అనూహ్యంగా వాయిదా పడింది. అయితే ఇప్పుడు రిలీజ్ డేట్ ను ప్రకటిస్తూ హోంబలే ఫిల్మ్స్‌ సంస్థ హనుమాన్ అంశ్ కొత్త పోస్టర్‌ను పంచుకుంది.

‘హనుమాన్ అన్ష్’ సినిమా విషయానికి వస్తే.. విశాల్ చతుర్వేది ఈ డివోషినల్ మూవీకి దర్శకత్వం వహించారు. ప్రముఖ ఆధ్యాత్మిక గురువు నీమ్ కరోలీ బాబా జీవితం ఆధారంగా ఈ సినిమాను రూపొందించారు. తల్లి మరణానంతరం ఆధ్యాత్మిక మార్గాన్ని అనుసరించి, ఆ తర్వాత నీమ్ కరోలీ బాబాగా ఎదిగిన లక్ష్మీనారాయణ్ అనే యువకుడి ఆధ్యాత్మిక ప్రయాణాన్ని ఈ చిత్రంలో చూపించారు. ఈ చిత్రంలో నీమ్ కరోలీ బాబా పాత్రలో శోభినవ్ సత్య నటించగా, విహాన్ షెడ్గే, చందన్ కె. ఆనంద్, పూర్ణిమా తివారీ, అనిల్ రస్తోగి, గుల్షన్ పాండే,    భగవాన్‌దాస్ పటేల్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమా భారతదేశంలో రూ. 312 కోట్లు, ప్రపంచవ్యాప్తంగా రూ. 404.25 కోట్లు వసూలు చేసి, తన బడ్జెట్‌కు దాదాపు 200 రెట్ల లాభాలు ఆర్జించింది.

అక్టోబర్ 09న గ్రాండ్ రిలీజ్..

హనుమాన్ అంశ్ సినిమా ట్రైలర్..



మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి