Reading Time: < 1 minute

సీఎం చంద్రబాబు సమావేశం సమీపంలో పేలుడు

Caption of Image.

సీఎం చంద్రబాబు సభ సమీపంలో భారీ శబ్దంతో గ్యాస్ సిలిండర్ పేలుడు కలకలం రేపింది. బుధవారం ( సెప్టెంబర్ 30 ) విజయవాడలోని అజిత్ సింగ్ నగర్ లో చంద్రబాబు సభ జరుగుతున్న మాకినేని బసవపున్నయ్య స్టేడియం దగ్గర ఈ ఘటన జరిగింది. ఒక్కసారిగా భారీ శబ్దంతో సిలిండర్ పేలడంతో సభలో ఉన్నవారంతా ఉలిక్కిపడ్డారు.

ఘటన జరిగిన వెంటనే అప్రమత్తమైన పోలీసులు క్షణాల వ్యవధిలో స్పందించి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. సభాస్థలానికి అతి దగ్గరగా ఉన్న నిమ్మకాయ సోడా బండి దగ్గర గ్యాస్ సిలిండర్ పేలినట్లు వెల్లడించారు పోలీసులు. ఎండ తీవ్రత కారణంగా సిలిండర్ పేలినట్లు గుర్తించామని తెలిపారు పోలీసులు. 

పేలుడు ధాటికి సిలిండర్ సుమారు 60 మీటర్ల దూరంలో ఉన్న విద్యుత్ స్తంభంపై పడటంతో భారీగా శబ్దం వచ్చింది. ఘటన జరిగిన ప్రాంతంలో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. పోలీసులు వెంటనే స్పందించి భద్రతా చర్యలు చేపట్టడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

©️ VIL Media Pvt Ltd.