Reading Time: < 1 minute

ఈసారి సిరిసిల్ల మీద గురి పెడదాం.. ఈ గడీని నేలమట్టం చేద్దాం: సీఎం రేవంత్

Caption of Image.

పిల్లకాకికి ఏం తెలుసు ఉండేలు దెబ్బ అన్నట్లుగా.. కేటీఆర్ కు ఏం తెలుసు కాంగ్రెస్ పార్టీ గురించి, రేవంత్ గురించి అని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. 2026 సెప్టెంబర్ 30న సిరిసిల్ల బహిరంగ సభలో మాట్లాడిన సీఎం.. కాంగ్రెస్ గురించి, రేవంత్ గురించి ఫామ్ హౌస్ లో పడుకున్న మీ తండ్రి కేసీఆర్ గురించి అడుగమని సలహా ఇచ్చారు. 

ఈ సందర్భంగా సిరిసిల్ల గడ్డమీద గురిపెడదామని  సిరిసిల్ల ప్రజలకు పిలుపునిచ్చారు రేవంత్. ఈసారి సిరిసిల్ల గడీని కూల్చేస్తామని హెచ్చరించారు. 

ఆనాడు గజ్వేల్ గడీని నేలమట్టం చేస్తామని చెప్పినం.. చేసి చూపించాం.. ఈ సారి సిరిసిల్ల గడీని కూల్చేస్తామని చెప్పారు.  

►ALSO READ | పదేండ్లలో సిరిసిల్లను ఉరిసిల్లగా మార్చిర్రు.. బీఆర్ఎస్‎పై CM రేవంత్ ఫైర్

ధైర్యం, దైవం కలగలిసిన ప్రాంతం సిరిసిల్ల అని అన్నారు సీఎం రేవంత్. సిరసాల అనే పేరు నుంచి సిరిసిల్ల వచ్చిందని.. సిరసాల అంటే సిరులకు నిలయమని అన్నారు. అలాంటిది పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో సిరిసిల్ల ఉరిసిల్లగా మారిందన్నారు. 

సిరిసిల్ల ప్రజలు వేసిన ఓట్లను పచ్చనోట్లుగా మార్చుకుని కేటీఆర్ కోట్లు సంపాదించాడని అన్నారు సీఎం రేవంత్. సిరిసిల్లను సమస్యల వలయంగా  కేటీఆర్ మార్చారని విమర్శించారు. వలసపోయిన గల్ఫ్ కార్మికులు చనిపోతే కనీసం పట్టించుకోలేదని అన్నారు. 
 

©️ VIL Media Pvt Ltd.