Reading Time: 2 minutes
Ranya rao: నటి రన్యారావుకు భారీ షాక్.. ఏకంగా రూ.89 కోట్ల జరిమానా!

కన్నడ సినీ నటి రన్యారావు పేరు మరోసారి వార్తల్లో నిలిచింది. గతంలో భారీ గోల్డ్ స్మగ్లింగ్ కేసులో అరెస్టై జైలు జీవితం గడిపిన ఆమెకు తాజాగా కస్టమ్స్ శాఖ నుంచి మరో ఎదురుదెబ్బ తగిలింది. అక్రమంగా విదేశాల నుంచి బంగారం తరలించిన వ్యవహారంలో రన్యారావుకు ఏకంగా రూ.89 కోట్ల జరిమానా విధించినట్లు సమాచారం. ఈ పరిణామం ప్రస్తుతం సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. 2025 మార్చి 3న దుబాయ్ నుంచి బెంగళూరులోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయానికి వచ్చిన రన్యారావును డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు తనిఖీ చేశారు. ఈ తనిఖీల్లో ఆమె వద్ద సుమారు 14 కిలోల బంగారం బయటపడటంతో అధికారులు ఒక్కసారిగా అప్రమత్తమయ్యారు. తర్వాత ఆమెను అదుపులోకి తీసుకుని గోల్డ్ స్మగ్లింగ్‌కు సంబంధించిన కేసులు నమోదు చేశారు. ఈ ఘటన అప్పట్లో దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీసింది. ముఖ్యంగా సినీ నేపథ్యం ఉన్న వ్యక్తి ఇలాంటి అక్రమ వ్యవహారంలో పట్టుబడటం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.

ఎన్టీఆర్‌తో రెండు సినిమాలు.. కెరీర్ పీక్‌లో ఉండగానే ఆత్మహత్యకు ప్రయత్నించింది.. ఇప్పుడు ఇలా

ఈ కేసుపై అధికారులు చేపట్టిన దర్యాప్తులో మరిన్ని కీలక విషయాలు వెలుగులోకి వచ్చినట్లు తెలుస్తుంది. 2024 మార్చి 7 నుంచి 2025 ఫిబ్రవరి 18 మధ్య కాలంలో రన్యారావు సహా నలుగురు వ్యక్తులు కలిసి విదేశాల నుంచి మొత్తం 113 కిలోల బంగారాన్ని అక్రమంగా భారత్‌కు తీసుకొచ్చినట్లు దర్యాప్తు నివేదికలో పేర్కొన్నారు. ఈ వ్యవహారానికి సంబంధించి కస్టమ్స్ అధికారులు సమగ్ర విచారణ చేపట్టారు.

తండ్రిని చిన్న వయసులోనే కోల్పోయాడు.. డబ్బంతా పోయింది..! కట్ చేస్తే ఇప్పుడు ఇండస్ట్రీని షేక్ చేస్తున్నాడు

ఈ కేసులో కొంతకాలం జైలు జీవితం గడిపిన రన్యారావుకు ప్రత్యేక న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది. అయితే బెయిల్‌పై బయటకు వచ్చినప్పటికీ ఆమెకు కేసు మాత్రం నడుస్తూనే ఉంది. తాజాగా కస్టమ్స్ శాఖ విచారణ తర్వాత రన్యారావుపై రూ.89 కోట్ల జరిమానా విధించినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ కేసులోని మిగిలిన ముగ్గురు నిందితులకు కలిపి మరో రూ.155 కోట్ల జరిమానా విధించినట్లు సమాచారం. ఒకప్పుడు వెండితెరపై నటిగా గుర్తింపు తెచ్చుకోవాలని ప్రయత్నించిన రన్యారావు, ఇప్పుడు గోల్డ్ స్మగ్లింగ్ కేసుతో వార్తల్లో నిలిచింది. భారీ మొత్తంలో జరిమానా విధించడంతో ఆమెకు మరో పెద్ద సమస్య ఎదురైనట్లయింది. అయితే ఈ కేసులో తదుపరి న్యాయపరమైన పరిణామాలు ఎలా ఉంటాయన్నది ఆసక్తికరంగా మారింది.

పొట్టకూటికోసం ఆటో నడిపాడు.. ఇప్పుడు తెలుగులో తోపు నటుడు.. ఆయన ఎవరంటే

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.