న్యూమరాలజీ ప్రకారం ఎవరు అయితే ఒకటో తేదీన జన్మిస్తారో వారు చాలా అదృష్టవంతులు అని చెబుతున్నారు సంఖ్యాశాస్త్ర పండితులు. వీరిలో చాలా ప్రత్యేకతలు దాగి ఉంటాయంట. ముఖ్యంగా ఆత్మవిశ్వాసం ఎక్కువగా ఉంటుంది. వీరిపై సూర్యుడి ప్రభావం ఎక్కువగా ఉండటం వలన నాయకత్వ లక్షణాలు కూడా అధికంగా ఉంటాయి. అందువలన అన్నీ విధాలుగా వీరు దూసుకెళ్తారు. జీవితంలో త్వరగా సక్సెస్ అవుతారు.
అలాగే ఏ నెలలో అయినా సరే ఐదవ తేదీన జన్మించిన వారు కూడా చాలా లక్కీ పర్సన్స్ అంటున్నారు పండితులు. వీరు చాలా తెలివైనవారు. కొత్త విషయాలు నేర్చుకోవడంలో చాలా ముందు ఉంటారు. ఏ రంగంలోకి వెళ్లినా వీరు కెరీర్ పరంగా త్వరగా సక్సెస్ అవుతారంట. ముఖ్యంగా ఈ తేదీలో జన్మించిన వారు చాలా చిన్న వయసులోనే సక్సెస్ అవుతారు.
ఎనిమిదో తేదీన జన్మించిన వారు కూడా చాలా అదృష్టవంతులు. వీరికి అన్ని విధాలుగా కలిసి వస్తుంది. చిన్నప్పటి నుంచే వీరు అన్ని రంగాల్లో ముందు ఉంటారు. నేర్చుకోవాలనే ఆసక్తి వీరిలో ఎక్కువగా ఉండటం వలన కెరీర్ పరంగా ఎలాంటి అడ్డంకులు లేకుండా చాలా త్వరగా జీవితంలో ఉన్నతస్థానానికి వెళ్తారు. అందరి నుంచి మన్ననలు పొందుతారు.
తొమ్మిదవ తేదీన జన్మించిన వారు కూడా అతి చిన్న వయసులోనే సక్సెస్ అవుతారంట. వీరిలో ధైర్యం, ఆత్మ విశ్వాసం చాలా ఎక్కువగా ఉంటుంది. అందువలన కెరీర్ పరంగా త్వరగా సక్సెస్ అవుతారు. ముఖ్యంగా వీరు కళా రంగంలో ఇంజనీరింగ్ రంగాల్లో దూసుకెళ్తారు. వీరు జీవితంలో త్వరగా సెట్ అవుతారు. అందరికీ ఆదర్శంగా నిలుస్తారు.
నోట్ : పై సమాచారం కేవలం ఇంటర్నెట్, నిపుణుల సలహా మేరకు మాత్రమే ఇవ్వడం జరిగింది. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు. కేవలం పాఠకుల ఆసక్తిమేరకు మాత్రమే ఇవ్వడం జరిగింది.




