Reading Time: 2 minutes

Bigg Boss Telugu 10: బిగ్‌బాస్ 10లో హై వోల్టేజ్ డ్రామా.. హద్దుమీరిన అమన్-త్రిగుణ్ గొడవతో దద్దరిల్లిన హౌస్!

Caption of Image.

బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 రోజు రోజుకు మరింత రసవత్తరంగా మారుతోంది. హౌస్ లో  మునుపెన్నడూ లేనంతగా వివాదాలు నెలకొన్నాయి. ఈ సీజన్‌లో 24వ రోజు ఎపిసోడ్‌ ఏకంగా ఒక రఫ్‌ అండ్ టఫ్ యాక్షన్ సినిమాను తలపించింది. టాస్కులు, డ్యాగర్లు, ఇమ్యూనిటీ కోసం పోటీ ఒకవైపు ఉంటే.. మరోవైపు కంటెస్టెంట్ల మధ్య గొడవలు హౌస్‌ను వేడెక్కిస్తున్నాయి. అమన్–త్రిగుణ్ ఘర్షణ బిగ్‌బాస్ ప్రేక్షకుల్లో హాట్ టాపిక్‌గా మారింది.

టాస్కుల మోత కంటే హౌస్‌మేట్స్ మధ్య జరిగిన అసభ్యకర వ్యాఖ్యలు, శృతిమించిన గొడవలే ఈ ఎపిసోడ్‌ను సోషల్ మీడియాలో అత్యంత హాట్ టాపిక్‌గా మార్చేశాయి. ఆరో వారం ఇమ్యూనిటీని ఖరారు చేసే అత్యంత కీలకమైన ‘డ్యాగర్ల సమరం’హౌస్‌లో రచ్చకు తెరలేపింది. రెండు కంటే ఎక్కువ డ్యాగర్లు సొంతం చేసుకుంటేనే ఇమ్యూనిటీ దక్కుతుందన్న బిగ్‌బాస్ బంపర్ ఆఫర్‌తో పోటీ తీవ్రరూపం దాల్చింది.

బిగ్‌బాస్ కంటెస్టెంట్లకు ఇచ్చిన ‘ఫైర్ వర్సెస్ లావా’ టాస్క్‌లో రెండు టీమ్‌లు తలపడ్డాయి. నేలకు కాలు తగలకుండా డ్రమ్స్‌పై నడుస్తూ తమ టీమ్‌కు చెందిన డ్రమ్స్‌ను నిర్దేశిత ప్రాంతంలో పెట్టాల్సి ఉండటంతో పోటీ మరింత ఉత్కంఠగా సాగింది. రెడ్ టీమ్ తరఫున రోహిత్, అమన్, వంశీ.. బ్లూ టీమ్ తరఫున దేబ్జానీ, ముకేశ్, త్రిగుణ్, సృష్టి పోటీలోకి దిగారు.  మాటామాటా పెరగడంతో ఇద్దరూ తీవ్ర స్థాయిలో ఒకరిపై ఒకరు విరుచుకుపడ్డారు. 

పోటీ కాస్త వ్యక్తిగత కక్షగా మారడంతో త్రిగుణ్ కోపంతో ఊగిపోతూ అమన్‌పై భౌతిక దాడికి దిగడమే కాకుండా, బూతులు తిట్టాడు.  త్రిగుణ్ వాడిన తీవ్ర అభ్యంతరకరమైన భాష కారణంగా టెలికాస్ట్ మధ్యలో ఆడియోను మ్యూట్ చేయాల్సి వచ్చింది. త్రిగుణ్ ఆగ్రహానికి అమన్ అంతే ఘాటుగా సమాధానమివ్వడంతో హౌస్ వాతావరణం క్షణాల్లో వేడెక్కింది. చివరకు దేబ్జానీ డ్యాగర్‌ను అమన్ కైవసం చేసుకుంది.

 అయితే గేమ్ కంటే అమన్–త్రిగుణ్ మధ్య మొదలైన వాగ్వాదమే హైలైట్ అయింది. ఈ ఘటనపై సోషల్ మీడియాలోనూ చర్చ మొదలైంది. త్రిగుణ్ ప్రవర్తనపై కొందరు నెటిజన్లు అభ్యంతరం వ్యక్తం చేస్తుండగా, మరికొందరు బిగ్‌బాస్ హౌస్‌లో ఇలాంటి ఘర్షణలు సహజమేనంటున్నారు. రెడ్ కార్డ్ ద్వారా త్రిగుణ్‌పై చర్య తీసుకుంటారా? అనే ఊహాగానాలు కూడా సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి. 

ఇదిలా ఉంటే కెప్టెన్ రూమ్‌లోని డ్యాగర్ల వ్యవహారం షాలిని–రోహిత్ మధ్య మరో వివాదానికి దారితీసింది. ఒకరిపై ఒకరు ఘాటైన వ్యాఖ్యలు చేసుకోవడంతో హౌస్‌లో వాతావరణం మరింత వేడెక్కింది. వంశీ, చరణ్ మధ్య కూడా గేమ్ స్ట్రాటజీపై వాగ్వాదం జరిగింది. ఈ ఎపిసోడ్ అంతా రణరంగాన్ని తలపించడం బిగ్ బాస్ ప్రేక్షకులను సైతం ఆశ్చర్యానికి గురిచేసింది.

మొత్తానికి డ్యాగర్ల కోసం మొదలైన ఆట.. ఒక్కొక్కరినీ గొడవల్లోకి లాగుతూ 24వ రోజు ఎపిసోడ్‌ను ఫుల్ యాక్షన్ ప్యాక్‌గా మార్చేసింది. ఇప్పుడు అందరి చూపు నాగార్జున హోస్టింగ్‌లో జరిగే వీకెండ్ ఎపిసోడ్‌పైనే ఉంది. అమన్–త్రిగుణ్ గొడవపై ఆయన ఎలా స్పందిస్తారన్నది ఆసక్తికరంగా మారింది.

©️ VIL Media Pvt Ltd.