
మీన రాశి వారికి అక్టోబరు నెల చాలా అనుకూలంగా ఉంటుంది. పట్టిన కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి. .లక్ష్మీదేవి అనుగ్రహంతో ధన యోగం, ఆధ్యాత్మిక చింతన పెరుగుతాయి.ఉద్యోగస్తులకు కొత్త అవకాశాలు లభిస్తాయి. విదేశీ ప్రయత్నాలు చేసేవారికి సానుకూల వార్తలు అందుతాయి. కార్యాలయంలో మీ పనితీరుకు ప్రశంసలు దక్కుతాయి. అధికారుల మద్దతు పూర్తిస్థాయిలో ఉంటుంది.
అక్టోబర్ మాసంలో అనేక పండుగలు ప్రారంభం కావడంతో చాలా గ్రహాలు కూడా తమ స్థానాలను మార్చుకుంటాయి. ఈ నెలలో ( 2026 అక్టోబర్) గ్రహాలు, నక్షత్రాలు సంచారంలో అనేక మార్పులు జరుగుతాయని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. ఈ నెలలో ( 2026 అక్టోబర్) శుక్రుడు.. సూర్యుడు..బుధుడు గ్రహాల సంచారంలో జరిగే మార్పుల వలన లక్ష్మీనారాయణ యోగం, మాళవ్య యోగం, బుధాదిత్యయోగం ఏర్పడనున్నాయి. వీటితో పాటు త్రిగ్రాహి యోగం ఏర్పడుతుందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు
అక్టోబర్లో గ్రహాల స్థాన చలనం మార్పుల వివరాలు
- అక్టోబర్ 3: తులారాశిలో శుక్రుడు వక్రగతి సంచారం
- అక్టోబర్ 17: తులారాశిలోకి సూర్యుడు
- అక్టోబర్ 24: తులారాశిలో బుధుడు వక్రగతి సంచారం
- అక్టోబర్ 31: సింహరాశిలోకి గురుడు
మీన రాశి వారికి ఈ నెల (2026 అక్టోబర్) ఆర్థిక స్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది. కొత్త ఆదాయ మార్గాలు ఏర్పడుతాయి. వ్యాపారంలో ఉన్నవారికి మంచి లాభాలు అందుతాయి. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ముందుకుసాగుతాయి. ఇంట్లో శుభకార్యాలు లేదా దైవ కార్యక్రమాలు నిర్వహించే సూచనలు ఉన్నాయి. సంతాన సంబంధిత పురోగతి ఆనందాన్ని ఇస్తుంది. ఆరోగ్యం సాధారణంగా బాగుంటుంది. అయితే, ఆహార నియమాలు పాటిస్తూ పొట్ట సంబంధిత జాగ్రత్తలు తీసుకోవడం మంచిదని పండితులు చెబుతున్నారు..
రాశ్యధిపతి గురువు పంచమస్థానంలో ఉచ్ఛ స్థితిలో ఉండడం, కుజుడితో కలవడం వలన ఆర్థిక పరిస్థితి ఇదివరకటి కంటే బాగా మెరుగుపడుతుంది. మనసులోని కోరికలు చాలావరకు నెరవేరుతాయి. వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అవుతాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల రీత్యా ఎక్కువగా ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. వివిధ రంగాలకు చెందిన ఉన్నత స్థాయి వ్యక్తులతో లాభదాయక పరిచయాలు ఏర్పడతాయి.
ఈ నెల (2026 అక్టోబర్) మీనరాశి వారి గ్రహాల సంచారాన్ని పరిశీలిస్తే 2వ ఇంట్లో ఉన్న చంద్రుడు సంచారం వలన ఇంటి ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి.మొదటి ఇంట్లో శని వక్రగతిలో సంచారం వలన పనిభారం పెరిగే అవకాశం ఉంది. 5వ ఇంట్లో కుజుడి నీచ స్థితిలో ఉండటం వలన ఆందోళన .. నిద్రలేమి వంటి సమస్యలు ఏర్పడుతాయి.
ప్రభుత్వపరంగా కొన్ని శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఉద్యోగ స్థిరత్వం కలుగుతుంది. వృత్తి, ఉద్యోగాలకు సంబంధించి కొన్ని సానుకూల మార్పులు, చేర్పులు చోటు చేసుకుంటాయి. నిరుద్యోగుల ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది. ఆదాయంలో మెరుగుదల, ఎదుగు దల ఉంటాయి కానీ, వృథా ఖర్చులు బాగా పెరుగుతాయి. మిత్రుల వల్ల నష్టపోయే అవకాశం ఉంది.
చేయాల్సిన పరిహారాలు
- రోజూ సుబ్రహ్మణ్యాష్టకం పఠించడం
- గురువారం రోజు దక్షిణామూర్తి స్ట్రోత్రం చదవడం
- రాఘవేంద్ర స్వామి దర్శనం చేసుకోవడం
- శనివారం వృద్ధులకు ధన సహాయం చేయడం
- గురువారం పేదలకు అన్నదానం , శనగలు దానం చేయడం
- శుక్రవారం బియ్యం దానం
Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనాన్ని జ్యోతిష్య నిపుణుల సలహాలతో పాటు ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించరు. మీకున్న జ్యోతిష్య సమస్యలకు నిపుణులను సంప్రదించటం ఉత్తమం.