Reading Time: < 1 minute

కవ్వాల్ రిజర్వ్ లో కుంటలకు జలకళ

Caption of Image.

జన్నారం, వెలుగు: ఇటీవల కురిసిన వర్షాలతో మంచిర్యాల జిల్లా కవ్వాల్ టైగర్ రిజర్వ్​లోని జన్నారం అటవీ డివిజన్​లో నీటి కుంటలు జలకళను  సంతరించుకున్నాయి. ఫలితంగా కుంటల వద్ద వన్యప్రాణులు, రకరకాల పక్షుల తాకిడి పెరిగింది. జన్నారం డివిజన్ లో మొత్తం 194 నీటి కుంటలను ఏర్పాటు చేసినట్లు ఎఫ్​డీవో రామ్మోహన్ తెలిపారు. కుంటల వల్ల వన్యప్రాణుల దాహార్తిని తీర్చడమే కాకుండా, వర్షపు నీటిని నిల్వ చేసి భూమిలోకి ఇంకేలా చేయడం ద్వారా అటవీ ప్రాంతాల్లో భూగర్భ జలాల స్థాయి పెరుగుతుందని ఆయన పేర్కొన్నారు.
 

©️ VIL Media Pvt Ltd.