మన శరీరం ఆరోగ్యంగా ఉండటంలో చర్మం కీలక పాత్ర పోషిస్తుంది. ఇది కేవలం బాహ్య రక్షణ కవచం మాత్రమే కాదు, ఒక ముఖ్యమైన అవయవం కూడా. చెమట రూపంలో అనేక వ్యర్థాలు చర్మం ద్వారా బయటకు పంపబడతాయి. అయితే, ఈ ప్రక్రియలో కొన్నిసార్లు చర్మ సమస్యలు వస్తాయి. వ్యర్థాలు బయటకు వచ్చిన తర్వాత చెమటలోని నీరు ఆవిరైపోగా, వ్యర్థ పదార్థాలు, అధికమైన లవణాలు (సాల్ట్స్), మృత కణాలు, విష పదార్థాలు చర్మంపై పేరుకుపోతాయి. ఇవి ఎక్కువసేపు చర్మంపై నిలిచి ఉండటం వల్ల గాలిలోని బ్యాక్టీరియా, ఫంగస్ వంటి క్రిములు వాటితో కలిసి చర్మంపై ఇన్ఫెక్షన్లను కలిగిస్తాయి, ఫలితంగా దురదలు, ఇరిటేషన్లు వస్తాయి.
Pముఖ్యంగా గాలి సరిగా ఆడకుండా ఉండే ప్రదేశాలైన గజ్జలు, చంకలు, మెడ ప్రాంతం, ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది. బట్టల రాపిడికి గురయ్యే ప్రదేశాల్లో చర్మం ఎరుపెక్కి, రంగు మారడం, ఒక్కోసారి నలుపుగా మారడం, చర్మం గట్టిపడటం వంటివి గమనించవచ్చు. ఉదయం స్నానం చేసిన తర్వాత మళ్లీ సాయంత్రం వరకు లేదా రాత్రి వరకు చెమటలు ఆరకపోవడం వల్ల ఈ సమస్యలు తీవ్రమవుతాయి.
ఇలాంటి చర్మపు దురదలకు, ఇరిటేషన్లకు తక్షణ ఉపశమనం ఒక ప్రభావవంతమైన సహజ నివారణ ఉంది అదే పిప్పర్మెంట్ నూనె. గతంలో వేపాకు పేస్ట్ రాసి స్నానం చేయడం, తర్వాత కొబ్బరినూనె వాడితే అవి తాత్కాలిక ఉపశమనాన్ని మాత్రమే ఇస్తాయని, పూర్తి నివారణకు పిప్పర్మెంట్ ఆయిల్ బాగా పనిచేస్తుందని అంటున్నారు.
పిప్పర్మెంట్ ఆయిల్ పుదీనా నుండి తయారు చేస్తారు. ఇది అరోమాటిక్ ఆయిల్స్ అమ్మే దుకాణాల్లో లభిస్తుంది. ఈ నూనెలో యాంటీ ఫంగల్, యాంటీ వైరల్, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు పుష్కలంగా ఉంటాయని అంటున్నారు. అందుకే ఇది చర్మంపై చేరిన క్రిములను నిరోధించి, దురదలను తగ్గిస్తుంది. ఇది ఒక శక్తివంతమైన, సహజసిద్ధమైన నూనె, దీనికి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు.
దురదలు ఉన్న ప్రదేశంలో, ముఖ్యంగా పుండ్లు లేకుండా ఉన్నచోట, ఒకటి లేదా రెండు చుక్కల పిప్పర్మెంట్ ఆయిల్‌ను రాసి నెమ్మదిగా రుద్దాలి. ఇది ఘాటుగా ఉంటుంది కాబట్టి తక్కువ మోతాదులో వాడటం మంచిది. ఒకసారి రాసిన తర్వాత సాయంత్రం వరకు దురద, ఇరిటేషన్ లేకుండా హాయిగా ఉంటుందని అంటున్నారు. అవసరమైతే రోజుకు రెండు లేదా మూడు సార్లు కూడా రాసుకోవచ్చు. ముఖ్యంగా మాస్కులు ధరించడం వల్ల మూతి భాగంలో చెమట నిలిచి దురదలు వస్తున్న వారికి ఇది చాలా ఉపయోగపడుతుంది. దోమకాటు వల్ల వచ్చే దద్దుర్లకు కూడా ఇది ఉపశమనాన్ని ఇస్తుంది.




