Reading Time: < 1 minute
సూపర్ మార్కెట్‌ ఏరియాలో భయానక దృశ్యం.. భయంతో జనం పరుగులు!

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలంలోని పీవీ కాలనీలో ఓ భారీ కొండచిలువ జనాలను పరుగులు పెట్టించింది. సింగరేణి కార్మికులు నివాసముండే సూపర్ బజార్ ఏరియాలోని క్వార్టర్స్ వద్ద ఈ భారీ కొండచిలువ ప్రత్యక్షమైంది. జనవాసాల మధ్యకు ఒక్కసారిగా అంత పెద్ద కొండచిలువ రావడంతో స్థానికులు భయంతో తలోదిక్కూ పరుగులు తీశారు. ముఖ్యంగా మహిళలు, చిన్నారులు ప్రాణభయంతో వణికిపోయారు. అప్రమత్తమైన కాలనీవాసులు స్థానిక స్నేక్ క్యాచర్ ముజఫర్‌కు సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న ముజఫర్ ఎంతో చాకచక్యంగా, శ్రమించి ఆ భారీ కొండచిలువను సురక్షితంగా బంధించారు. అనంతరం దానిని సమీపంలోని దట్టమైన అటవీ ప్రాంతంలో వదిలిపెట్టారు. కొండచిలువను పట్టుకోవడంతో కాలనీవాసులు ఊపిరి పీల్చుకున్నారు. తమను ప్రమాదం నుంచి కాపాడిన స్నేక్ క్యాచర్ ముజఫర్‌కు కాలనీ ప్రజలు ప్రత్యేక అభినందనలు, ధన్యవాదాలు తెలియజేశారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Cement Price Hike: ఇంటి నిర్మాణం చేపడుతున్నారా.. సిమెంట్‌ ధరలు పెరిగిపోతున్నాయ్‌ జాగ్రత్త!

ఏఐ దూకుడుకు కళ్లెం.. ఎన్విడియా కొత్త టూల్ ఆవిష్కరణ

Heart Disease: మహిళల్లో గుండె జబ్బులు.. పురుషులకు భిన్నం! నిర్లక్ష్యం చేస్తే ప్రమాదమే!

Pulses Rates: పండగవేళ సామాన్యుడికి షాక్‌.. పప్పుల ధరలకు రెక్కలు

కోట్లు పోగొట్టుకున్నా బుద్ధి రాలేదు.. డబ్బుతో డ్యాన్స్ చేస్తూ మరో రీల్!