ప్రతి నెల వచ్చే కరెంట్ బిల్లు చూసి షాక్ అవుతున్నారా? ఎక్కువ మొత్తంలో కరెంట్ బిల్లు కట్టలేక ఇబ్బంది పడుతున్నారా? అయితే మీ కోసమే ఈ అద్భుతమైన సమాచారం. ఇంట్లో కరెంట్ బిల్లు ఎక్కువ రావడానికి ప్రధాన కారణాలు ఏసీ, ఫ్రిజ్, వాషింగ్ మెషిన్, వాటర్ హీటర్ వంటివి. అయితే వీటిని ఉపయోగించడం కాదు, సరైన పద్ధతిలో ఉపయోగించకపోవడమే కరెంట్ బిల్లు పెరగడానికి అసలు కారణం అంటున్నారు నిపుణులు. వీటిని సరైన పద్ధతిలో తెలివిగా వాడితే మీ కరెంట్ బిల్లు సగానికి సగం తగ్గించుకోవచ్చునంట. అది ఎలా అంటే?
చిన్న సీక్రెట్ ఫాలో అవుతే చాలు కరెంట్ బిల్లు తగ్గుతుంది. చిన్న చిన్న అలవాట్లు మార్చుకుంటేనే బిల్లును 30 నుంచి 40 శాతం వరకు తగ్గించుకోవచ్చు. అందులో అత్యంత ముఖ్యమైన టిప్ ఏసీ వాడకంలో ఉంది. చాలామంది చల్లదనం కోసం ఏసీని 18 లేదా 20 డిగ్రీల వద్ద పెడతారు. దీనివల్ల కరెంట్ వినియోగం రెట్టింపు అవుతుంది. నిపుణుల సూచన ప్రకారం ఏసీని ఎప్పుడూ 24 నుంచి 27 డిగ్రీల మధ్య ఉంచాలి. దీనివల్ల ఆరోగ్యానికి మంచిది, బిల్లు కూడా భారీగా తగ్గుతుంది.
ఇక ఫ్రిజ్ విషయంలో పదేపదే డోర్ తీయడం, వేడి వంటకాలను నేరుగా పెట్టడం, కుక్కి పెట్టడం వల్ల కంప్రెసర్ ఎక్కువ పనిచేసి కరెంట్ ఎక్కువ లాగుతుంది. అందువలన ఫ్రిజ్ విషయంలో కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. పదే పదే డోర్ తీయకుండా చూసుకోవాలి. అప్పుడే కరెంట్ బిల్లు మీరు ఆదా చేసుకోవచ్చును.
అలాగే వాషింగ్ మెషిన్ ను రోజూ కొన్ని బట్టల కోసం కాకుండా, ఫుల్ లోడ్ అయ్యాకే వాడాలి. దీని వలన కరెంట్ బిల్లు ఆదా అవుతుంది. అలగా కొంత మంది, చార్జర్లు వాడకపోయినా ప్లగ్ లో ఉంచడం, టీవీని రిమోట్ తోనే ఆఫ్ చేసి మెయిన్ స్విచ్ ఆఫ్ చేయకపోవడం వంటి చిన్న చిన్న తప్పులు చేస్తుంటారు. దీని వలన కూడా పవర్ వేస్ట్ అవుతుంది.
క్లియర్గా చెప్పాలి అంటే కరెంట్ బిల్లు కాస్త తక్కువగా రావాలి అంటే, కొత్త పరికరాలు కొనాల్సిన పనిలేదు. ఏసీ టెంపరేచర్ ను 25 డిగ్రీల వద్ద సెట్ చేయడం, LED బల్బులు వాడడం, 5 స్టార్ రేటింగ్ ఉన్న పరికరాలను ఎంచుకోవడం వంటి సింపుల్ టిప్స్ పాటిస్తే చాలు. ఈ మార్పులతో నెలవారీ బిల్లులో స్పష్టమైన తేడాను మీరే గమనిస్తారు.




