Reading Time: < 1 minute

మోయినాబాద్ మున్సిపాలిటీలో ఏసీబీ సోదాలు… రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డ ఇద్దరు ఆఫీసర్లు..

Caption of Image.

మొయినాబాద్ మున్సిపాలిటీలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు ఏసీబీ అధికారులు. బుధవారం ( సెప్టెంబర్ ) నిర్వహించిన ఈ సోదాల్లో ఇద్దరు అధికారులు లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు. టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ గుండు వాణి, సీనియర్ అసిస్టెంట్ యెలమోని సుదర్శన్ లను అరెస్ట్ చేశారు అధికారులు.

ఈ ఇద్దరు అధికారులు అక్రమ నిర్మాణంపై చర్యలు తీసుకోకుండా ఉండేందుకు లంచం డిమాండ్ చేశారని బాధితుడు ఫిర్యాదు చేయగా.. రంగంలోకి దిగారు ఏసీబీ అధికారులు. ఈ క్రమంలో ఫిర్యాదుదారుడి నుంచి రూ.75 వేల లంచం తీసుకుంటుండగా పట్టుకున్నట్లు తెలిపారు. సీనియర్ అసిస్టెంట్ సుదర్శన్ దగ్గర రూ.75 వేల లంచం సొమ్ము స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.

►ALSO READ | శంషాబాద్ ఎయిర్పోర్ట్లో రూ.26 కోట్ల కొకైన్ పట్టివేత

ఇద్దరు అధికారులు అధికార దుర్వినియోగానికి పాల్పడినట్లు గుర్తించిన ఏసీబీ అధికారులు నిందితులను నాంపల్లిలోని ఏసీబీ ప్రత్యేక కోర్టులో హాజరుపరిచినట్లు తెలిపారు. అనంతరం కోర్టు ఆదేశాలతో నిందితులను రిమాండ్ కు తరలించారు అధికారులు.

©️ VIL Media Pvt Ltd.