Reading Time: < 1 minute

పెద్దపల్లి రాజీవ్ రహదారిపై కారులో అకస్మాత్తుగా మంటలు.. పరుగులు తీసిన జనం

Caption of Image.

పెద్దపల్లి టౌన్ లో కారులో మంటలు చెలరేగటం భయాందోళనకు గురిచేసింది. రంగంపల్లి నుంచి కలెక్టరేట్ కి వెళ్లే రాజీవ్ రహదారిపై కారులో మంటలు చెలరేగడంతో జనాలు పరుగులు తీశారు. 
కారు ఇంజన్ భాగంలో మంటలు అంటుకోవడంతో కారును రోడ్డుపైనే ఆపి ప్రాణాలు దక్కించుకున్నారు వాహనదారులు.

షోరూమ్ ముందు కారు నిలిచి పోవడంతో స్థానికులు నీళ్లతో మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ వెంటనే  మంటలు అదుపులోకి రాలేదు. మంటలు ఇంజన్ నుండి టైర్లు ఇతర భాగాలకు వ్యాపించడం తో  ఆందోళన నెలకొంది. 

షోరూం నిర్వాహకులు షో రూమ్ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టి ఎక్స్ట్రింగ్గ్విషర్లతో మంటలు అదుపులోకి తెచ్చారు. ఈ ప్రమాదంలో ఎవరికి ఏం కాకపోవడంతో ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు.

©️ VIL Media Pvt Ltd.