
- పాన్ యామ్ ఫ్లైట్ హైజాక్ సమయంలో భారత ఫ్లైట్ అటెండెంట్ సాహసం
న్యూఢిల్లీ, వెలుగు: ఫ్లైదుబాయ్ ఘటన నేపథ్యంలో నాలుగు దశాబ్దాల క్రితం వందలాది మంది ప్రయాణికులను కాపాడి ప్రాణాలు అర్పించిన నీరజా భానోట్ ఉదంతం గుర్తుకొస్తోంది. 1986 సెప్టెంబర్ 5న పాక్‌లోని కరాచీ ఎయిర్‌పోర్టులో పాన్ యామ్ ఫ్లైట్ 73ను నలుగురు ఉగ్రవాదులు హైజాక్ చేశారు. ఆ విమానంలో ప్రయాణికులు, సిబ్బంది కలిపి 379 మంది ఉన్నారు.
దాదాపు 17 గంటల పాటు సాగిన ఈ ఘటనలో 20 మంది మరణించగా, వంద మందికి పైగా గాయపడ్డారు. అప్పటికి 22 ఏళ్ల వయసున్న సీనియర్ ఫ్లైట్ పర్సన్ నీరజా హైజాకర్లను గుర్తించిన వెంటనే పైలట్లను అప్రమత్తం చేశారు. దీంతో వారు కాక్‌పిట్ నుంచి తప్పించుకోగలిగారు. నీరజకు తప్పించుకునే అవకాశం ఉన్నా, పిల్లలను కాపాడేందుకు తిరిగి వెళ్లి కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయారు. కేంద్రం ఆమెకు మరణానంతరం అశోక చక్ర ప్రకటించింది.