Reading Time: < 1 minute
Pm Modi Jhalmuri Video Viral West Bengal Campaign

ప్రధాని మోడీ ఆదివారం పశ్చిమ బెంగాల్‌లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా జార్గ్రామ్‌లో ఒక స్నాక్ సెంటర్ దగ్గరకు వెళ్లారు. రుచికరమైన ఝల్‌మురి (మరమరాలు)ని ఆస్వాదించారు. ఇందుకు సంబంధించిన వీడియోను మోడీ తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేశారు. ప్రస్తుతం వీడియో ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోంది.

ప్రచారంలో భాగంగా ఆదివారం మోడీ కొంత సేపు విరామం తీసుకున్నారు. ఆ సమయంలో ఝల్‌మురి స్టాల్ దగ్గరకు వెళ్లి విక్రేతతో సరదాగా మాట్లాడుతూ.. ‘‘భాయ్.. హమే అప్నా ఝల్‌మురి ఖిలావో.’’ అని కోరారు. విక్రేత.. ‘‘మీరు ఉల్లిపాయలు తింటారా?’’ అని అడగగా.. మోడీ నవ్వుతూ.. ‘‘ప్యాజ్ ఖాతే హై, దిమాగ్ నహీ ఖాతే బస్” అని సరదాగా స్పందించారు. దీంతో అక్కడనున్న వారంతా నవ్వుకున్నారు. రూ.10 చెల్లించి ఝల్‌మురి తీసుకుని తీన్నారు.

మోడీ పోస్ట్ చేసిన వీడియోను కేవలం 24 గంటల్లోనే ఇన్‌స్టాగ్రామ్‌లో 10 కోట్ల మంది వీక్షించగా… ఫేస్‌బుక్‌లో దాదాపు 9 కోట్ల వ్యూస్ సాధించింది. మోడీ తెలుపు కుర్తా, నీలం పిన్‌స్ట్రైప్ వెస్ట్‌కోట్, బీజేపీ లోటస్ గుర్తుతో ఎరుపు గామ్ఛా ధరించి కనిపించారు.

ఝల్‌మురి బెంగాల్‌లో అత్యంత ప్రజాదరణ పొందిన స్పైసీ స్నాక్. మసాలా, ఉప్పు కారం, తరిగిన ఉల్లిపాయ, టమాటా, పచ్చిమిర్చి ముక్కలు వేసి తయారు చేస్తారు. రుచికరమైన ఝల్‌మురిని తిన్నానంటూ మోడీ ఎక్స్‌లో రాసుకొచ్చారు. ఆ వీడియోను మరోసారి చూసేయండి.

 

View this post on Instagram

 

A post shared by Narendra Modi (@narendramodi)