Reading Time: 2 minutes
Jio Phone: కేవలం రూ.299కే ఫోన్.. ఆరు నెలల పాటు రీఛార్జ్ ఫ్రీ.. జియో సంచలన ఆఫర్..

రిలయన్స్ జియో మరో బంపర్ ఆఫర్ తీసుకొచ్చింది. కేవలం రూ.299కే ఫీచర్ ఫోన్ అందించనుంది. జియో 10వ వార్షికోత్సవ ఆఫర్‌లో భాగంగా దీనిని తక్కువ ధరకు అందుబాటులోకి తీసుకొచ్చినట్లు ప్రకటించింది. భారత్ టెలికాం రంగంలోకి జియో అడుగుపెట్టి 10 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ఫోన్ యూజర్లకు వార్షికోత్సవ ఆఫర్‌ను ప్రకటించింది. ఈ ఆఫర్‌లో భాగంగా రూ.1499కే 4జీ జియో భారత్ ఫోన్‌తో పాటు ఆరు నెలల పాటు రూ.1200 విలువ చేసే రీఛార్జ్‌ను ఉచితంగా అందించనుంది. దీంతో ఫోన్ రూ.299కే లభించినట్లు అవుతుంది. ఈ ఫోన్ కొనుగోలు చేస్తే ఆరు నెలల పాటు రీఛార్జ్ చేసుకోవాల్సిన పని లేదు. ఉచిత రీఛార్జ్ ప్రయోజనాలు లభిస్తాయి. అన్ లిమిటెడ్ కాల్స్ చేసుకోవచ్చు.

ఆరు నెలల పాటు ఫ్రీ..

ఆరు నెలల పాటు అన్‌లిమిటెడ్ కాల్స్‌తో పాటు ప్రతీ నెలా 14జీబీ డేటా పొందవచ్చు. 2జీ ఫోన్ రీఛార్జ్ కోసం నెలకు రూ.199 ఖర్చు అవుతుంది. ఆరు నెలల పాటు అంటే రూ.1200 అవుతుంది. రూ.1499 పెట్టి ముందుగా ఈ ఫోన్ కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఆరు నెలల పాటు రీఛార్జ్‌కు రూ.1200 అవుతుంది. అయితే జియో ఆరు నెలల రీఛార్జ్ ఉచితంగా అందిస్తుండటంతో రూ.1200 తీసివేస్తే రూ.299కే ఫోన్ లభిస్తున్నట్లు లెక్క. ఈ ఫోన్‌లో అనేక ఫీచర్లు ఉన్నాయి. కాల్స్, మెస్సేజ్‌లే కాకుండా టీవీ చూడటంతో పాటు సాంగ్స్ వినవచ్చు. యూపీఐ పేమెంట్స్ కూడా చేసుకోవచ్చు. హెచ్‌డీ వాయిల్ కాల్స్ కూడా మాట్లాడుకోవచ్చు. జియోభారత్ సిరీస్‌లో భాగంగా A1, B1, B2, B3తో పాటు అనేక మోడళ్లను విడుదల చేశారు. వీటిల్లో జియో పే ద్వారా యూపీఐ పేమెంట్స్ చేసే సౌకర్యం కూడా ఉంది. ఇక టీవీ చూడటంతో పాటు ఎఫ్‌ఎం రేడియో వినడవచ్చు. ఫ్లాట్ లైట్ వంటి ఫీచర్లు ఈ ఫోన్లలో ఉన్నాయి. కీప్యాడ్ ఫోన్లను ఇష్టపడేవారికి ఇవి మంచి అనుభూతిని అందిస్తాయి.

జియో భారత్ 4జీ ఫోన్ ఫీచర్లు, స్పెసిఫికేషన్లు

-2.4-అంగుళాల డిస్‌ప్లే, 2,000mAh బ్యాటరీ

-జియో 4G నెట్‌వర్క్, HD వాయిస్ కాలింగ్‌

-జియోటీవీ ద్వారా ఉచితంగా 500కు పైగా టీవీ ఛానెళ్లు

– జియోహాట్‌స్టార్‌లో లైవ్ క్రికెట్, సినిమాలు, ఇతర కంటెంట్‌ ఉచితంగా చూడవచ్చు

– జియో మ్యూజిక్ ద్వారా సాంగ్స్ వినవచ్చు

-జియోపే ద్వారా డిజిటల్ చెల్లింపులు చేసుకోవచ్చు

– జియో సేఫ్టీ షీల్డ్ సేఫ్ కాలింగ్, లొకేషన్ మానిటరింగ్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

Jio Recharge Phone

Jio Recharge Phone