
హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పునర్వ్యవస్తీకరణపై కీలక ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వం. GHMC పునర్వ్యవస్థీకరణకు అనుగుణంగా హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్‌లో మార్పులు చేపట్టింది. మూడు పోలీస్ డివిజన్ల పేర్లు మార్పు..బడంగ్‌పేట్ పోలీస్ స్టేషన్ రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వం.ఈ మేరకు కొత్త పరిధులను ఖరారు చేస్తూ గురువారం ( అక్టోబర్ 1 ) జీవో విడుదల చేసింది.
కీలక మార్పులు ఇవే:
- రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయ డివిజన్‌ను శంషాబాద్ డివిజన్‌గా పేరు మార్పు.
- చిక్కడపల్లి డివిజన్‌ను కాచిగూడ డివిజన్‌గా మార్పు
- సంతోష్ నగర్ డివిజన్‌ను చత్రినాక డివిజన్‌గా మార్పు
- హైదరాబాద్ సిటీ పోలీస్ పరిధిలో జోన్లు, డివిజన్లు, పోలీస్‌స్టేషన్ల పునర్వ్యవస్థీకరణ
- హైదరాబాద్ సిటీ పోలీస్ పరిధిలో మొత్తం 76 ప్రాంతాలపై మార్పులు
- కొన్ని పోలీస్‌స్టేషన్ల పరిధులు ఇతర జోన్లు, డివిజన్లకు బదిలీ
- మార్కెట్ పీఎస్ పరిధిలోని పలు ప్రాంతాలు మల్కాజిగిరి కమిషనరేట్‌కు బదిలీ
- మహేశ్వరం, శంషాబాద్, సైబరాబాద్ పరిధుల్లోనూ మార్పులు
- ఆర్‌జీఐఏ పీఎస్ పేరును శంషాబాద్ పీఎస్‌గా మార్పు
- శంషాబాద్ డివిజన్‌లో ఆర్‌జీఐఏ పీఎస్, శంషాబాద్ పీఎస్‌ల పునర్వ్యవస్థీకరణ
- రాజేంద్రనగర్ పీఎస్ పరిధిలోని పలు ప్రాంతాల్లో మార్పులు
- అబ్దుల్లాపూర్‌మెట్, మీర్‌పేట్ ప్రాంతాల పోలీస్ పరిధుల్లో మార్పులు
- జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, సనత్‌నగర్ ప్రాంతాల్లోనూ పరిధుల పునర్విభజన
- ట్రాఫిక్ పోలీస్ పరిధిలోనూ జోన్లు, డివిజన్ల పునర్వ్యవస్థీకరణ
- వుమెన్ సేఫ్టీ వింగ్ పరిధిలోనూ కొత్తగా జోన్ల కేటాయింపు
- జోనల్ సైబర్ సెల్ పరిధులను కూడా పునర్వ్యవస్థీకరించిన ప్రభుత్వం