Reading Time: < 1 minute

తెలంగాణలో రేపటి (అక్టోబర్ 2, 2026) నుంచి అమల్లోకి క్యూర్ చట్టం.. పెరగనున్న ప్రాపర్టీ ట్యాక్స్

Caption of Image.

హైదరాబాద్: తెలంగాణలో రేపటి (అక్టోబర్ 2, 2026) నుంచి క్యూర్ చట్టం అమల్లోకి రానుంది. 1955 GHMC యాక్ట్ స్థానంలో క్యూర్ చట్టాన్ని అమల్లోకి తీసుకురానున్నారు. GHMC, CMC, MMCలకు ఒకే సమగ్ర పాలనా విధానం అమల్లోకి రానుంది.

మూడు కార్పొరేషన్లలో భవన నిర్మాణ అనుమతులకు ఒకే నిబంధనలు ఉండనున్నాయి. క్యూర్ యాక్ట్ ద్వారా నగరంలో ప్రాపర్టీ ట్యాక్స్ పెరగనుంది. పెరిగే ప్రాపర్టీ ట్యాక్స్ వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి అమల్లోకి వస్తుంది.

ప్రస్తుతం జీహెచ్ఎంసీ పరిధిలో రెంటల్ వాల్యూ ఆధారంగా ప్రాపర్టీ ట్యాక్స్ వసూలు చేస్తున్నారు. క్యూర్ యాక్ట్తో క్యాపిటల్ వాల్యూ ఆధారంగా ప్రాపర్టీ ట్యాక్స్ విధిస్తారు. ప్రతీ ప్రాపర్టీకి ప్రత్యేక ఇంటిగ్రేటెడ్ ఐడెంటిటీ కోడ్, ప్రాపర్టీ ట్యాక్స్, వాటర్ బిల్, సీవరేజ్ బిల్, శానిటేషన్‌కు ఇంటిగ్రేటెడ్ బిల్లింగ్ అమల్లోకి వస్తుంది.

ఆస్తి పన్ను, ట్రేడ్ లైసెన్స్‌లలో మూడు కార్పొరేషన్లకు ఒకే విధానం ఉంటుంది. విలీన ప్రాంతాల్లో పన్నులు, పాలనలో వేర్వేరు విధానాలకు క్యూర్ యాక్ట్తో తెర పడనుంది. డిజిటల్ గవర్నెన్స్‌కు సింగిల్ పోర్టల్ ద్వారా పౌర సేవలు అందుబాటులోకి రానున్నాయి.

ట్రాఫిక్, విపత్తుల నిర్వహణకు ప్రత్యేక అథారిటీల ఏర్పాటుతో పాటు క్యూర్ యాక్ట్తో హైడ్రాకు చట్టబద్ధ హోదా దక్కనుంది. చెరువులు, నాలాలు, ప్రభుత్వ భూముల రక్షణకు హైడ్రాకు అదనపు అధికారాలు.. అక్రమ నిర్మాణాలు, ఆక్రమణలపై హైడ్రాకు స్పష్టమైన చట్టపరమైన అధికారాలు దక్కనున్నాయి.

©️ VIL Media Pvt Ltd.