
ఎల్నిలో ఎఫెక్ట్.. వర్షాకాలంలో కూడా ఎండలు మండుతున్నాయి. సీజన్ తగ్గట్టుగా వాతావరణం లేదు. ఎండమంట కు తట్టుకోలేక జనాలు అల్లాడిపోతున్నారు. అయితే చల్లను రోజుకు రెండు సార్లు తాగితే చాలు.. బాడీ అంతా కూల్అయ్యే ఎంతో హాయిగా ఉంటుంది. అందుకే పూర్వం పెద్దలు అంతా చల్లకు ఎంతో ప్రిఫరెన్స్ ఇచ్చేవారు.
గడ్డపెరుగుకు ఇచ్చే ఇంపార్టెన్స్ చల్లకి ఇవ్వం. ఎండాకాలంలో తప్ప చల్ల తాగేవాళ్లు తక్కువే. అయితే సీజన్ తో సంబంధం లేకుండా చల్లని రోజూ తాగితే మంచిది అంటున్నారు డాక్టర్లు. అయినా ఇప్పుడు డాక్టర్లు చెప్పటం కాదు చల్ల గురించి తాతలూ, అమ్మమ్మలూ చిన్నప్పు డు చాలానే చెప్పారు మనమే కాస్త మర్చి పోయాం అంతే…
- పాల లాగానే చల్ల ని కూడా కంప్లీట్ ఫుడ్ అనొచ్చు. ఇందులో ప్రోటీన్స్, కార్బోహై డ్రేట్స్, విటమిన్స్, ఎసెన్షియల్ ఎంజైమ్స్ అన్నీ ఉన్నాయి.
- చల్ల శరీరాన్ని చల్లబరుస్తుంది. అల్లం, జీలకర్ర పొడి కలిపిన చల్ల తాగితే మసాల పదార్థాలు తిన్న తరువాత వచ్చే ఇరిటేషన్ ని తగ్గించవచ్చు. మెనోపాజ్ టైంలో ఉన్న మహిళలకు చల్ల ఎంతో మేలు చేస్తుంది.
- పొట్టలో గ్యాస్ తయారు కాకుండా చూస్తుంది. స్టమక్ ఇన్ఫెక్షన్స్ ని తగ్గిస్తుం ది. మలబద్ధకాన్ని నివారిస్తుంది.
- చల్లలో కాల్షియం ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల ఆస్టియోపొరాసిస్ వంటి వ్యాధులు వచ్చే ముప్పు తప్పించుకోవచ్చు.
- చల్లలో బీకాంప్లెక్స్ విటమిన్లు ఉన్నాయి. ఇవి ఎనీమియా నుంచి కాపాడతాయి. ఇందులో ఉండే విటమిన్-డీ ఇమ్యూన్ సిస్టంని బలపరుస్తుంది.