
- బయోగ్యాస్ ప్లాంట్ల ఏర్పాటుకు చర్యలు
- ఎంఎంసీ కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డి
హైదరాబాద్ సిటీ, వెలుగు: గేటెడ్ కమ్యూనిటీల్లో తడి వ్యర్థాలను అక్కడికక్కడే ప్రాసెస్ చేసేందుకు ఏరోబిన్ కంపోస్టర్లను ఏర్పాటు చేయాలని ఎంఎంసీ కమిషనర్వినయ్ కృష్ణారెడ్డి అధికారులను ఆదేశించారు. ప్రాజెక్టుల పురోగతి, పెండింగ్ పనులపై బుధవారం ఆయన ఎంఎంసీ ఆఫీసులో సమీక్ష నిర్వహించారు. గేటెడ్‌కమ్యూనిటీలు, పెద్ద కాలనీల్లో బల్క్ వేస్ట్ జనరేటర్లను గుర్తించి, అక్కడే బయోగ్యాస్ ప్లాంట్ల ఏర్పాటును ప్రోత్సహించాలని సూచించారు.
ప్రైవేట్ హాస్టళ్లలోనూ సేంద్రియ వ్యర్థాల నిర్వహణకు బయోగ్యాస్ ప్లాంట్లు ఏర్పాటు చేసేలా నిర్వాహకులకు అవగాహన కల్పించాలని కోరారు. కొబ్బరి బొండాల వ్యర్థాలను కోయిర్ పరిశ్రమలకు( కొబ్బరి పీచు ఆధారంగా నడిచేవి) అనుసంధానం చేయాలన్నారు. పూల వ్యర్థాలతో ధూప్‌స్టిక్స్, అగరుబత్తీలు వంటి పర్యావరణహిత ఉత్పత్తుల తయారీపై మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులకు శిక్షణ ఇప్పించాలని సూచించారు. అడిషనల్కమిషనర్ రఘుప్రసాద్, చీఫ్ ఇంజినీర్ శ్రీనివాస్‌రావు, ఎస్‌బీఎం–పీఐయూ బృందం, రామ్‌కీ ప్రతినిధులు పాల్గొన్నారు.