
దుబాయ్: వచ్చే ఏడాది జరగనున్న ఐసీసీ వన్డే వరల్డ్ కప్ షెడ్యూల్ విడుదలైంది. 2027 అక్టోబర్ 7న కేప్‌టౌన్‌లో ఇండియా, ఆస్ట్రేలియా మ్యాచ్‌తో మెగా టోర్నీ ప్రారంభమవుతుంది. 10న పాకిస్తాన్ (జొహనెస్‌బర్గ్)తో, 14న అఫ్గానిస్తాన్ (సెంచూరియన్)తో, 17న క్వాలిఫయర్ జట్టు (బ్లూమ్‌ఫోంటైన్)తో, 24న జింబాబ్వే (విక్టోరియా ఫాల్స్)తో టీమిండియా మ్యాచ్‌లు ఆడనుంది.
రౌండ్ రాబిన్ పద్ధతిలో మొత్తం 30 గ్రూప్ స్టేజ్ మ్యాచ్‌లు జరుగుతాయి. అక్టోబర్ 25 నుంచి నవంబర్ 14 వరకు సూపర్–7 మ్యాచ్‌లు ఉంటాయి. ఈ దశలో మొత్తం 21 మ్యాచ్‌లు ఆడతారు. నవంబర్ 17, 18న సెమీఫైనల్స్, 21న ఫైనల్స్ జరుగుతాయి. సౌతాఫ్రికా, జింబాబ్వే, నమీబియాలో మొత్తం 12 వేదికల్లో మ్యాచ్‌లు జరగనున్నాయి. గ్రూప్–ఎలో ఆస్ట్రేలియా, పాకిస్తాన్, జింబాబ్వే, అఫ్గానిస్తాన్, క్వాలిఫయర్ జట్టు ఉన్నాయి. వరల్డ్ కప్ గెలవాలంటే ఇండియా ఫైనల్‌తో కలిపి మొత్తం 12 మ్యాచ్‌లు ఆడాల్సి ఉంటుంది.