Reading Time: 2 minutes

రీతూ చౌదరికి డిమాన్ పవన్ బ్రేకప్… పరిస్థితులు అదుపు తప్పాయంటూ ఎమోషనల్ పోస్ట్!

Caption of Image.

బుల్లితెర రియాలిటీ షో ‘బిగ్ బాస్ తెలుగు సీజన్ 9’ వేదికపై  డిమాన్ పవన్, నటి రీతూ చౌదరి తమ కెమెస్ట్రీతో లక్షలాది మంది అభిమానుల హృదయాలను గెలుచుకున్నారు. అలా మొదలైన వీరిద్దరి స్నేహ బంధం మధ్య విభేదాలు తారాస్థాయి చేరాయి. దీంతో రీతూ చౌదరికి బ్రేకప్ చెబుతూ తన ఇన్ స్టాలో  పవన్ ఎమోషనల్ పోస్ట్ పెట్టారు.  ఇకపై తమ ఇద్దరి బంధం కొనసాగదని.. తాము విడిపోయామని రాసుకొచ్చారు. 

ఈ విడిపోవడం వెనుక ఉన్న అసలు నిజాలను బయటపెడుతూ డిమాన్ పవన్ సోషల్ మీడియాలో పెట్టిన సుదీర్ఘమైన, భావోద్వేగపూరితమైన ఈ  ఇన్ స్టా స్టోరీ ఇప్పుడు వైరల్ గా మారింది. ఎవరూ ఎవరినీ ఉపయోగించుకోలేదు. తెరపై మీరు చూసే రంగుల ప్రపంచానికి, నిజ జీవితంలో ఎదురయ్యే ముళ్ల బాటలకు చాలా తేడా ఉంటుంది అని పవన్ స్పష్టం చేశాడు. తమ మధ్య ఇంకెదో జరిగిందంటూ వస్తున్న పుకార్లు, నెగెటివిటీతో నేను విసిగిపోయా.  మా ఇద్దరికీ వ్యక్తిగత బలాలు, బలహీనతలు ఉన్నాయి.  గతంలో పలు ప్రాజెక్టులలో కలిసి పనిచేశారాం.. ఇక పై రివాన్ ఉండదు అని స్పష్టంచేశారు.

గత కొన్ని నెలలుగా వీరి మధ్య మనస్పర్థలు తీవ్రస్థాయికి చేరాయి. ప్రతిసారీ తానే తగ్గి, బంధాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నించినప్పటికీ, పరిస్థితులు అదుపు తప్పాయని పవన్ ఆవేదన వ్యక్తం చేశాడు.  ఆమె నన్ను వాట్సాప్‌లో బ్లాక్ చేయడం, స్నాప్‌చాట్ నుంచి తొలగించడం తనకు నచ్చలేదని చెప్పుకొచ్చారు. ఇలా  మొదలైన ఈ సోషల్ మీడియా యుద్ధం.. ఇన్‌స్టాగ్రామ్‌లో ఒకరినొకరు అన్‌ఫాలో చేసి బ్లాక్ చేసుకునేంత తీవ్రంగా మారింది.   మనశ్శాంతి కోసమే ఇద్దరం విడివిడిగా ప్రాజెక్ట్‌లు చేయాలని నిర్ణయించుకున్నట్లు పవన్ తెలిపాడు.

బిగ్‌బాస్ తర్వాత’బీబీ జోడీ’ డ్యాన్స్ షోలో తమ అద్భుతమైన పర్ఫార్మెన్స్‌లతో ఆకట్టుకున్న ఈ జంట, ఇటీవలే ‘బంగారం’ అనే ప్రైవేట్ ఆల్బమ్ సాంగ్‌తో ప్రేక్షకులను అలరించారు. ఆ పాట మ్యూజిక్ ఛార్ట్‌బస్టర్‌గా దూసుకుపోతున్న సమయంలోనే, ఈ విధంగా బ్రేకప్ ప్రకటన రావడం అభిమానులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.

ALSO READ :  ‘వారణాసి’ కోసం ఏఐకి No చెప్పి 1500 మందితో డబ్బింగ్..

ప్రస్తుతం తెలుగులో బిగ్‌బాస్ 10వ సీజన్ సందడి నెలకొనగా, గతేడాది రన్నరప్‌గా నిలిచిన డిమోన్ పవన్ చేసిన ఈ వ్యాఖ్యలపై రీతూ చౌదరి ఎలా స్పందిస్తుందోనని అంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ‘రివాన్’ ప్రయాణం ఇలా బ్రేకప్  కావడం బుల్లితెర వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

©️ VIL Media Pvt Ltd.