Reading Time: 2 minutes
OTT Movie: 25 కోట్లతో తీస్తే 320 కోట్ల కలెక్షన్లు.. ఓటీటీలోకి వచ్చేసిన మలయాళం బ్లాక్ బస్టర్.. తెలుగులోనూ చూడొచ్చు

ఎప్పటిలాగే ఈ శుక్రవారం ( అక్టోబర్ 02) థియేటర్లతో పాటు ఓటీటీలోకి పలు కొత్త సినిమాలు వచ్చేశాయి. తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడం, మలయాళం భాషలకు చెందిన సినిమాలు, సిరీస్ లు ఇప్పుడు వివిధ ఓటీటీ ప్లాట్ ఫామ్స్ లో సందడి చేస్తున్నాయి. కార్దీ సర్దార్ 2, రోమాంచకం, సుమంత్ మహేంద్రగిరి వారాహి, , #లవ్ సిరీస్, పూజా మేరీ జాన్ తదితర సినిమాలు, సిరీస్ లు ఇప్పుడు ఆడియెన్స్ కు వినోదం అందిస్తున్నాయి. అలా ఈ వారం ఓటీటీల్లోకి వచ్చిన వాటిలో ఒక మలయాళం బ్లాక్ బస్టర్ మూవీ కూడా ఉంది. ఇదొక ప్యూర్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్. కొన్ని రోజుల క్రితమే థియేటర్లలో విడుదలై బ్లాక్ బస్టర్ గా నిలిచింది. బాక్సాఫీస్ వద్ద కనివినీ ఎరుగని కలెక్షన్లు రాబట్టింది. కేవలం రూ. 25 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించిన ఈ సినిమా ఓవరాల్ గా రూ. 320 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించింది. తద్వారా మలయాళంలో అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రంగా నిలిచింది. ఇక మైత్రీ మూవీ మేకర్స్ ద్వారా తెలుగులోనూ రిలీజైన ఈ మూవీకి ఇక్కడ కూడా మంచి కలెక్షన్లే వచ్చాయి. ఫ్యామిలీ ఆడియెన్స్ ముఖ్యంగా యూత్ అయితే ఈ సినిమాను ఎగబడి చూసేశారు. థియేటర్లలో కలెక్షన్ల వర్షం కురిపించిన ఈ బ్లాక్ బస్టర్ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది. ఒరిజినల్ మలయాళం వెర్షన్ తో పాటు తెలుగులోనూ ఈ సినిమా అందుబాటులో ఉంది.

ఆడియెన్స్ ఎంతగానో ఎదురుచూస్తోన్న ‘బెత్లెహొమ్‌ కుటుంబ యూనిట్‌’ ఓటీటీలోకి వచ్చేసింది. శుక్రవారం (అక్టోబర్ 02) అర్ధరాత్రి నుంచే ఈ సినిమా స్ట్రీమింగ్ కు అందుబాటులో వచ్చేసింది. మలయాళం స్టార్ నివిన్ పౌలీ ఇందులో హీరోగా నటించాడు. అలాగే ప్రేమలు ఫేమ్, ట్రెండింగ్ బ్యూటీ మమితా బైజు కథానాయికగా చేసింది. ప్రేమలు’ లాంటి క్లాసిక్ లవ్ స్టోరీని తెరకెక్కంచిన దర్శకుడు గిరీష్ ఏడీ ఈ న్యూ ఏజ్ లవ్ స్టోరీని కూడా తెరకెక్కించాడు. సంగీత్ ప్రతాప్, సురేశ్ కృష్ణ, వినయ్ ఫోర్ట్, రోషన్ షానవాస్ తదితరులు కీలకపాత్రలు పోషించారు. దిలీష్ పోతన్, ఫహాద్ ఫాజిల్, శ్యామ్ పుష్కరన్ తదితరులు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు. విష్ణు విజయ్ ఈ సినిమాకు స్వరాలు సమకూర్చారు. థియేటర్లలో సంచలన విజయం సాధించిన ఈ సినిమా ఓటీటీలో ఎలాంటి రెస్పాన్స్ తెచ్చుకుంటుందో చూడాలి.

జియో హాట్ స్టార్ లో మమితా బైజు, నివిన్ పౌలీల సినిమా..

‘బెత్లెహొమ్‌ కుటుంబ యూనిట్‌’ సినిమా ట్రైలర్ తెలుగులో..



 

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.