Reading Time: < 1 minute

గురి పెట్టి..గోల్డ్ కొట్టారు.. ఏషియన్ గేమ్స్లో.. ఒకే రోజు తెలంగాణకు మూడు స్వర్ణాలు

Caption of Image.
  • కాంపౌండ్‌‌‌‌‌‌‌‌ విభాగంలో చికితాకు రెండు స్వర్ణాలు
  • 2028 లాస్‌‌‌‌‌‌‌‌ ఏంజిల్స్‌‌‌‌‌‌‌‌ ఒలింపిక్స్‌‌‌‌‌‌‌‌ బెర్త్‌‌‌‌‌‌‌‌ కూడా ఖరారు
  • మిక్స్‌‌‌‌‌‌‌‌డ్‌‌‌‌‌‌‌‌ ట్రాప్‌‌‌‌‌‌‌‌ షూటింగ్‌‌‌‌‌‌‌‌లో హైదరాబాదీ  కైనన్‌‌‌‌‌‌‌‌కు గోల్డ్​

ఆసియా క్రీడల్లో తెలంగాణ ప్లేయర్లు స్వర్ణాల మోత మోగించారు. పెద్దపల్లి జిల్లా సుల్తాన్‌‌‌‌‌‌‌‌పూర్‌‌‌‌‌‌‌‌కు చెందిన స్టార్‌‌‌‌‌‌‌‌ ఆర్చర్‌‌‌‌‌‌‌‌ చికితా తానిపర్తి రెండు స్వర్ణాలతో సత్తా చాటితే.. హైదరాబాద్‌‌‌‌‌‌‌‌ స్టార్‌‌‌‌‌‌‌‌ షూటర్‌‌‌‌‌‌‌‌ కైనన్‌‌‌‌‌‌‌‌ చినాయ్‌‌‌‌‌‌‌‌ కూడా గోల్డ్‌‌‌‌‌‌‌‌ మెడల్‌‌‌‌‌‌‌‌తో మెప్పించాడు. మొత్తానికి బుధవారం మూడు స్వర్ణాలతో ఏషియాడ్‌‌‌‌‌‌‌‌లో తెలంగాణ పేరును మార్మోమోగించారు. ఆర్చరీ కాంపౌండ్‌‌‌‌‌‌‌‌ టీమ్‌‌‌‌‌‌‌‌ విభాగం ఫైనల్లో చికితతో పాటు ఆంధ్రప్రదేశ్‌‌‌‌‌‌‌‌కు చెందిన జ్యోతి సురేఖ వెన్నం, ప్రీతిక ప్రదీప్‌‌‌‌‌‌‌‌ త్రయం 238–234 తేడాతో చైనాపై సంచలన విజయం సాధించింది. 

మెన్స్‌‌‌‌‌‌‌‌ టీమ్‌‌‌‌‌‌‌‌ ఫైనల్లో కుశాల్‌‌‌‌‌‌‌‌ దలాల్‌‌‌‌‌‌‌‌–సాహిల్‌‌‌‌‌‌‌‌ జాదవ్‌‌‌‌‌‌‌‌–గణేశ్‌‌‌‌‌‌‌‌ మణిరత్నంతో కూడిన ఇండియా బృందం 238–237 తేడాతో చైనానే ఓడించి టాప్‌‌‌‌‌‌‌‌ ప్లేస్‌‌‌‌‌‌‌‌తో స్వర్ణం గెలిచారు. కాంపౌండ్‌‌‌‌‌‌‌‌ మిక్స్‌‌‌‌‌‌‌‌ టీమ్‌‌‌‌‌‌‌‌ ఫైనల్లో చికిత–సాహిల్‌‌‌‌‌‌‌‌ జాదవ్‌‌‌‌‌‌‌‌ 158–157 తేడాతో కొరియాపై గెలిచి హ్యాట్రిక్‌‌‌‌‌‌‌‌ గోల్డ్‌‌‌‌‌‌‌‌ మెడల్స్‌‌‌‌‌‌‌‌ను పూర్తి చేశారు. ఫలితంగా 2028 లాస్‌‌‌‌‌‌‌‌ ఏంజిల్స్‌‌‌‌‌‌‌‌ ఒలింపిక్‌‌‌‌‌‌‌‌ కోటాను దక్కించుకున్నారు. ట్రాప్‌‌‌‌‌‌‌‌ మిక్స్‌‌‌‌‌‌‌‌డ్‌‌‌‌‌‌‌‌ టీమ్‌‌‌‌‌‌‌‌ ఫైనల్లో తెలంగాణ షూటర్‌‌‌‌‌‌‌‌ కైనన్‌‌‌‌‌‌‌‌ చినాయ్‌‌‌‌‌‌‌‌–నీరూ దండా జోడీ 34 పాయింట్లతో స్వర్ణాన్ని ఒడిసిపట్టుకుంది. ఇంతకుముందే విమెన్స్‌‌‌‌‌‌‌‌ 25 మీటర్ల పిస్టల్‌‌‌‌‌‌‌‌ షూటింగ్‌‌‌‌‌‌‌‌లో ఇషా సింగ్‌‌‌‌‌‌‌‌ సిల్వర్‌‌‌‌‌‌‌‌ మెడల్‌‌‌‌‌‌‌‌ను గెలిచిన సంగతి తెలిసిందే. 

©️ VIL Media Pvt Ltd.