Reading Time: 2 minutes

జ్యోతిష్యం:అక్టోబర్‌ నెలలో కీలగ గ్రహాలు మార్పు.. తులా రాశి వారికి కొత్త ఆశలు చిగురింపు.. ఆర్థికంగా ఊహించని లాభాలు..

Caption of Image.

తులారాశికి అధిపతులు శుక్రుడు, సూర్యుడు. అక్టోబర్‌లో నెలలో ఇదే రాశిలో  శుక్రుడు, బుధుడు ఈ రాశిలో సంచరిస్తారు. ఈ రాశి వారు అపారమైన సంపదను ఆకర్షిస్తారు. మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుందని జ్యోతిష్యపండితులు చెబుతున్నారు.  గ్రహాల సంచారం ఆధారంగా 2026 అక్టోబర్​ నెల ఈ రాశి వారికి ఎలా ఉంటుందో ఈ స్టోరీలో తెలుసుకుందాం.  .

 ఈ నెలలో మీరు శ్రేయస్సు, సామరస్యం, విలాసవంతమైన జీవితాన్ని అనుభవిస్తారు. తులారాశి వారి ఆర్థిక పరిస్థితి బాగా మెరుగుపడుతుంది. ఉద్యోగంలో సమస్యలు తొలగిపోతాయి. అక్టోబర్ 19న సూర్యుడు కూడా తులారాశిలోకి ప్రవేశించడంతో, మీరు జీవితంలో ఊహించని పురోగతిని చూస్తారు.

 తులా రాశి వారికి అక్టోబర్​ నెల  కొన్ని రంగాల్లో అనుకూలత లభించినప్పటికీ, ఖర్చులు, ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగంలో అనుకూలమైన వాతావరణం ఉంటుంది. పైఅధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. స్థానచలనం లేదా బాధ్యతల మార్పు ఉండే అవకాశం ఉంది. 
అక్టోబర్ మాసంలో అనేక పండుగలు ప్రారంభం కావడంతో చాలా గ్రహాలు కూడా తమ స్థానాలను మార్చుకుంటాయి.  ఈ నెలలో ( 2026 అక్టోబర్) గ్రహాలు, నక్షత్రాలు సంచారంలో అనేక మార్పులు జరుగుతాయని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.  

అక్టోబర్​లో గ్రహాల స్థాన చలనం మార్పుల వివరాలు

  • అక్టోబర్ 3: తులారాశిలో శుక్రుడు వక్రగతి సంచారం
  •  అక్టోబర్ 17:   తులారాశిలోకి  సూర్యుడు 
  • అక్టోబర్ 24: తులారాశిలో   బుధుడు వక్రగతి సంచారం
  • అక్టోబర్ 31: సింహరాశిలోకి గురుడు 

జ్యోతిష్య శాస్త్ర ప్రకారం ఈ నెలలో ( 2026 అక్టోబర్)​ శుక్రుడు.. సూర్యుడు..బుధుడు గ్రహాల సంచారంలో జరిగే మార్పుల వలన లక్ష్మీనారాయణ యోగం, మాళవ్య యోగం, బుధాదిత్యయోగం ఏర్పడనున్నాయి. వీటితో పాటు త్రిగ్రాహి యోగం ఏర్పడుతుందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు

తులారాశి వారు అక్టోబర్​ కొత్త ఉత్సాహంతో పని చేస్తారు. 1వ ఇంట్లో సూర్య సంచారం.. 10వ ఇంట్లో కుజుడు పనిభారాన్ని పెంచుతాడు. 6వ ఇంట్లో శని వక్రీకరించడం వలన ప్రతి పనిలో కూడా ప్రణాళిక అవసరం.  ఇదే రాశిలో శుక్రుడు సంచారం వలన ఆర్థికంగా ఎలాంటి ఇబ్బంది ఉండదు. బుధుడు వక్రగతిలో సంచారం వలన గతంలో పెండింగ్​లో ఉన్న పనులు తిరిగి ప్రారంభమవుతాయి.10వ ఇంట్లో  కుజుడు సంచారం మీరు చేసే పనులను  వేగవంతం చేస్తాడు. 11వ ఇంట్లో ఉన్న గురుడు సంచారం వలన అన్ని విషయాలు అనుకూలంగా ఉంటాయి. 

ఆర్థిక విషయానికి వస్తే కొత్తగా ఆదాయ మార్గాలు పెరిగినప్పటికీ, ఊహించని ఖర్చులు ఇబ్బంది పెడతాయి.  కుటుంబ అవసరాలు, ప్రయాణాల నిమిత్తం ధనవ్యయం ఎక్కువ అవుతుంది. పెట్టుబడుల విషయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.  వ్యాపారస్తులకు పెద్ద లాభాలు, కొత్త ఒప్పందాలు కుదురుతాయి. సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి.

కుటుంబ సభ్యుల మధ్య చిన్నపాటి అభిప్రాయ భేదాలు వచ్చినా సమయానుకూలంగా సమసిపోతాయి. జీవిత భాగస్వామితో సమయం గడపడానికి ప్రయత్నించండి. కంటి సమస్యలు, జీర్ణవ్యవస్థ లేదా అలసట వంటి చిన్నపాటి ఆరోగ్య రుగ్మతలు వచ్చే అవకాశం ఉంది. ఆహార నియమాలు పాటించాలి. 

చేయాల్సిన పరిహారాలు: 

 

  • ప్రతి మంగళవారం హనుమాన్ చాలీసా పఠించడం
  • ప్రతి శనివారం ఆంజనేయస్వామికి ఆకుపూజ చేయించడం
  • ప్రతి శుక్రవారం శుక్రదేవుని మంత్రమైన “ఓం శుక్రాయ నమః” అనే మంత్రాన్ని పఠించాలి
  • సాయంత్రం పూజా స్థలంలో ఆవు నెయ్యితో దీపం వెలిగించండి.
  • ఉదయాన్నే  కాలకృత్యాలు తీర్చుకొని స్నానం చేసి 11 సార్లు సూర్య నమస్కారాలు చేయాలి.  అప్పటివరకు కనీసం మంచినీళ్లు కూడా తాగకూడదు.
  • ప్రతిరోజూ ఇంట్లో మల్లె సువాసన గల అగరబత్తులను వెలిగించండి.
  • ఆదివారం నాడు పేదలకు బెల్లం, గోధుమలు పంచండి
Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనాన్ని జ్యోతిష్య నిపుణుల సలహాలతో పాటు ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించరు. మీకున్న  జ్యోతిష్య సమస్యలకు నిపుణులను సంప్రదించటం ఉత్తమం.
©️ VIL Media Pvt Ltd.