Reading Time: < 1 minute

కుషాయిగూడలో కారు హిట్ అండ్ రన్.. 9 మందిని ఢీకొట్టి డ్రైవర్ పరార్

Caption of Image.

హైదరాబాద్: మేడ్చల్ జిల్లా కుషాయిగూడలో కారు బీభత్సం సృష్టించింది. అతి వేగంగా దూసుకొచ్చిన కారు రోడ్డు పక్కన నడుచుకుంటూ వెళ్తున్న తొమ్మిది మందిని ఢీకొట్టింది. ఇందులో ముగ్గురు పరిస్థితి విషమంగా ఉండగా.. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. బుధవారం (సెప్టెంబర్ 30) రాత్రి ఈసీఐఎల్ న్యూ చైతన్య కాలేజీ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది.  

ప్రమాదం అనంతరం డ్రైవర్ కారు ఆపకుండా పరారయ్యాడు. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని సహయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం దగ్గర్లోని ఆసుపత్రులకు తరలించారు. ఈ ఘటనపై పోలీసులు హిట్ అండ్ రన్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పరారీలో ఉన్న కారు డ్రైవర్ కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. నిందితుడిని గుర్తించేందుకు ఘటన స్థలంలోని సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

 

©️ VIL Media Pvt Ltd.