Reading Time: < 1 minute

పండుగల వేళ వ్యాపారులకు షాక్ ..కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ ధరలు పెరిగాయ్..

Caption of Image.

పండుగల సీజన్ వేళ కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ కస్టమర్లకు ధరల పెంపు భారంగా మారింది. అక్టోబర్ 1 నుంచి దేశంలోని పలు నగరాల్లో 19 కిలోల కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ ధరలు పెరిగాయి. ఒక్కో కమర్షియల్ సిలిండర్ పై రూ.71లు పెరిగింది. 

పెరిగిన ధరలతో ఢిల్లీలో 19 కిలోల కమర్షియల్ సిలిండర్ ధర రూ.2వేల810కి చేరింది. ముంబైలో రూ.2వేల764  ఉంది. చెన్నైలో సిలిండర్ ధర రూ.2వేల983కి పెరిగింది.  పాట్నాలో అత్యధికంగా రూ.71.50 పెరుగుదల నమోదైంది. దీంతో 19 కిలోల కమర్షియల్ సిలిండర్ ధర రూ.3వేల100.50కు చేరింది. లక్నోలో ధర రూ.2వేల932, లేహ్‌లో  రూ.3వేల450కి చేరింది.

డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధరల్లో మార్పు లేదు

ఇదిలా ఉంటే 14.2 కిలోల డొమెస్టిక్ ఎల్పీజీ సిలిండర్ ధరల్లో మాత్రం ఎలాంటి మార్పు లేదు. ఢిల్లీలో రూ.942, ముంబైలో రూ.941, చెన్నైలో రూ.957గా గృహ వంటగ్యాస్ ధర కొనసాగుతోంది. 

కమర్షియల్ ఎల్పీజీ ధరల పెంపుతో హోటళ్లు, రెస్టారెంట్లు, క్యాటరింగ్ సంస్థలు, చిన్నతరహా ఆహార వ్యాపారాలపై అదనపు భారం పడే అవకాశం ఉంది.

©️ VIL Media Pvt Ltd.