
ప్రస్తుతం సినిమాల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వినియోగం రోజురోజుకూ పెరుగుతోంది. ముఖ్యంగా డబ్బింగ్, వాయిస్ క్లోనింగ్, విజువల్ ఎఫెక్ట్స్ వంటి వాటిలో AI కీలకంగా మారుతోంది. కానీ దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి మాత్రం తన నెక్స్ట్ మూవీ ‘వారణాసి’ విషయంలో AIపై ఆధారపడకుండా.. మనుషుల వాయిస్‌లకే జక్కన్న ఇంపార్టెన్స్ ఇవ్వాలని డిసైడ్ అయ్యాడట.
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటిస్తున్న ఈ సినిమాను ఏకంగా 50 భాషల్లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. ఇందుకోసం దాదాపు 1500 మంది వాయిస్ ఆర్టిస్టుల శాంపిల్స్‌ను పరిశీలించనున్నట్టు రిపోర్టులు వస్తున్నాయి. ప్రతి భాషలోనూ క్యారెక్టర్ల ఎమోషన్, డైలాగ్ డెలివరీ సరిగ్గా కనెక్ట్ కావాలన్నదే రాజమౌళి ఆలోచనగా తెలుస్తోంది. అంటే మహేష్ బాబు డైలాగ్ మరో భాషలో వినిపించినా.. అది AI వాయిస్‌లా కాకుండా, ఆ పాత్రకు సూటయ్యే నిజమైన నటుడి గొంతుతో వినిపించబోతోందన్నమాట.
AIతో రాజమౌళికి సమస్య ఏంటి?
జార్జియా యూనివర్సిటీ విద్యార్థులతో మాట్లాడిన దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి జనరేటివ్ ఏఐపై తన అభిప్రాయాలను వెల్లడించారు. ఫిల్మ్ మేకింగ్‌లో ఏఐ ఉపయోగకరమే అయినా.. మనుషుల ఎమోషన్స్, క్రియేటివిటీని పూర్తిగా రీప్లేస్ చేయలేదని ఆయన అన్నారు. రీసెర్చ్, R&D, ప్రీ-ప్రొడక్షన్ పనులకు ఏఐ మంచి అసిస్టెంట్‌గా పనిచేస్తుందని రాజమౌళి చెప్పారు. గతంలో వారాలు, నెలలు పట్టే కొన్ని పనులను ఇప్పుడు గంటల్లోనే పూర్తి చేయగలుగుతున్నామని తెలిపారు.
అయితే జనరేటివ్ ఏఐ విషయంలో మాత్రం తనకు ఇంకా సందేహాలు ఉన్నాయని స్పష్టం చేశారు. సినిమా క్రియేటివ్ ప్రాసెస్, డిజిటల్ ఫిల్మ్ మేకింగ్‌లో ఏఐపై పూర్తిగా ఆధారపడటం లేదని.. అవసరమైన చోట సపోర్టింగ్ టూల్‌గా మాత్రమే ఉపయోగిస్తున్నామని రాజమౌళి వెల్లడించారు.
Ss Rajamouli on ai #varanasi pic.twitter.com/IPthfEp17A
— Filmy Updates (@filmiyupdates) September 29, 2026
50 భాషల్లో ‘వారణాసి’.. టార్గెట్ గ్లోబల్ ఆడియన్స్!
ఇప్పటికే రాజమౌళి సినిమాలకు పాన్ ఇండియా క్రేజ్ ఉంది. కానీ ‘వారణాసి’తో ఆయన మరో అడుగు ముందుకు వేస్తున్నట్టు కనిపిస్తోంది. సినిమాను సుమారు 50 భాషల్లోకి డబ్ చేసి.. 120కి పైగా దేశాల్లో రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. అందుకే డబ్బింగ్ విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారట. ఒక్క భాషలో సినిమా హిట్ అయితే సరిపోదు.. ప్రపంచంలోని వివిధ భాషల ప్రేక్షకులకు కూడా అదే ఎమోషన్ రీచ్ కావాలన్నది జక్కన్న ప్లాన్ వెనుక ఉద్దేశంగా కనిపిస్తోంది.
రుద్ర పాత్రలో విభిన్న షేడ్స్..
సినిమాలో మహేష్ బాబు రుద్ర అనే పాత్రలో కనిపించనున్నాడు. ఈ క్యారెక్టర్ సాధారణ హీరోలా కాకుండా.. చాలా పెద్ద లక్ష్యంతో ప్రయాణించే వ్యక్తిగా ఉంటుందని రాజమౌళి ఇప్పటికే వెల్లడించారు. రుద్ర పాత్రలో యాక్షన్ మాత్రమే కాదు.. ఎమోషన్, హ్యూమర్, బలహీనత, పవర్ వంటి విభిన్న షేడ్స్ ఉంటాయని తెలుస్తోంది. ప్రియాంక చోప్రా మందాకినిగా నటిస్తుండగా.. మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ కుంభ పాత్రలో కనిపించనున్నాడు.
టైమ్ ట్రావెల్.. పురాణాలు.. సైన్స్..
‘వారణాసి’ని కేవలం ఒక యాక్షన్ అడ్వెంచర్ సినిమాగా చెప్పలేం. ఇందులో టైమ్ ట్రావెల్, పురాణాలు, సైన్స్, అడ్వెంచర్ వంటి అంశాలు కీలకంగా ఉండబోతున్నాయి. కథ ప్రాచీన కాలం నుంచి 2027 వరకు ప్రయాణిస్తుందని సమాచారం. వారణాసి నుంచి ఆఫ్రికా, అంటార్కిటికా, ప్రాచీన రోమ్ వరకు కథ విస్తరించనుందని తెలుస్తోంది. అంటే సినిమా మొత్తం ఒకే కాలంలో జరగదు. ప్రేక్షకులను ఒక్కో టైమ్ పీరియడ్‌లోకి తీసుకెళ్లేలా రాజమౌళి కథను డిజైన్ చేసినట్టు సమాచారం.
మహేష్ బాబు శ్రీరాముడిగా..
సినిమాకు మరింత హైప్ తీసుకొచ్చిన అంశం మహేష్ బాబు శ్రీరాముడి పాత్రలో కనిపించనున్నారనే సమాచారం. రామాయణానికి సంబంధించిన ఓ కీలకమైన ఎపిసోడ్‌ను సినిమాలో భాగంగా చూపించబోతున్నట్టు రాజమౌళి వెల్లడించారు. ఈ సీక్వెన్స్ కోసం ఏకంగా 60 రోజుల పాటు షూటింగ్ చేసినట్టు వార్తలు వచ్చాయి. ఇది సినిమాలో చిన్న సీన్ కాదని.. కథలో కీలకమైన భాగంగా ఉండబోతుందని తెలుస్తోంది.
షూటింగ్ చివరి దశలో ‘వారణాసి’?
ప్రస్తుతం సినిమా షూటింగ్ కీలక దశకు చేరుకున్నట్టు సమాచారం. ఇప్పటికే చాలా భారీ యాక్షన్ సన్నివేశాలను పూర్తి చేసినట్టు రాజమౌళి తెలిపారు. వేలాది మంది ఆర్టిస్టులతో భారీ యాక్షన్ సీక్వెన్స్‌లను తెరకెక్కించినట్టు గతంలో వార్తలు వచ్చాయి. మోషన్ క్యాప్చర్ టెక్నాలజీని కూడా సినిమా కోసం ఉపయోగిస్తున్నారు. అంటే థియేటర్‌లో ప్రేక్షకులు చూసే విజువల్స్ సాధారణ సినిమాలతో పోలిస్తే చాలా గ్రాండ్‌గా ఉండేలా రాజమౌళి ప్లాన్ చేస్తున్నట్టు అర్థమవుతోంది.
రాజమౌళి మేకింగ్‌లో ఈసారి కొత్తగా ఏంటి?
‘బాహుబలి’తో ఒక కొత్త ప్రపంచాన్ని చూపించిన రాజమౌళి.. ‘RRR’తో యాక్షన్, ఎమోషన్‌ను గ్లోబల్ లెవల్‌కు తీసుకెళ్లారు. ఇప్పుడు ‘వారణాసి’లో మాత్రం టైమ్ ట్రావెల్ + పురాణాలు + సైన్స్ + యాక్షన్ + అడ్వెంచర్ + భారీ విజువల్స్ అన్నింటినీ కలిపి కొత్త అనుభూతిని ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నారు. ముఖ్యంగా సినిమా విజువల్స్ ఎంత గ్రాండ్‌గా ఉన్నా.. పాత్రల ఎమోషన్ ప్రేక్షకుడికి కనెక్ట్ కావాలని రాజమౌళి భావిస్తున్నట్టు తెలుస్తోంది.
అందుకే ఒకవైపు భారీ VFX, మోషన్ క్యాప్చర్, గ్లోబల్ స్కేల్.. మరోవైపు ప్రతి భాషలోనూ సహజమైన వాయిస్‌ల కోసం 1500 మంది ఆర్టిస్టుల ఎంపిక సినిమా స్థాయిని సూచిస్తుంది. మొత్తానికి ‘వారణాసి’ విషయంలో రాజమౌళి స్కేల్ మాత్రమే కాదు.. ప్రతి చిన్న డీటెయిల్‌పై కూడా ఫోకస్ పెడుతున్నట్టు కనిపిస్తోంది. మరి 50 భాషల్లో వారాణసి ఎలాంటి ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది? అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇకపోతే, ‘వారణాసి’ 2027 ఏప్రిల్ 7న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది.