Reading Time: < 1 minute

హైదరాబాద్ చైతన్యపురిలో.. గుడిలో పూజలు జరుగుతుండగా.. సంతోషిమాత విగ్రహంపై దాడి..!

Caption of Image.

హైదరాబాద్ లోని చైతన్యపురి పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. స్థానిక భవానీ నగర్ లో ఉన్న సంతోషిమాత ఆలయంలో పూజలు జరుగుతుండగా ఓ దుండగుడు అమ్మవారి విగ్రహంపై దాడికి పాల్పడ్డాడు. శుక్రవారం ( అక్టోబర్ 2 ) ఉదయం జరిగిన ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి..

ఆలయంలో పూజలు జరుగుతుండగా ఒక వ్యక్తి ఆలయంలోకి వచ్చి.. నేరుగా గర్భగుడిలోకి వెళ్లి చేతిలో ఉన్న కర్రలతో సంతోషిమాత విగ్రహంపై దాడికి పాల్పడ్డాడు. ఈ ఊహించని ఘటనతో గుడిలో ఉన్న పూజారులు, భక్తులు భయాందోళనకు గురయ్యారు. భక్తులు కేకలు వేయడంతో లోపలి వచ్చిన స్థానికులు దుండగుడిని పట్టుకొని దేహశుద్ది చేసి.. పోలీసులకు సమాచారం అందించారు.

స్థానికుల సమాచారంతో ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు పోలీసులు. 

నిందితుడిని మహమ్మద్ అన్సారీగా పోలీసులు గుర్తించినట్లు తెలిపారు. అన్సారీ గత కొంతకాలంగా మానసిక సమస్యలతో బాధపడుతున్నాడని… చికిత్స పొందుతున్నాడని తెలిపారు పోలీసులు. ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
 

©️ VIL Media Pvt Ltd.