
వీధికుక్కలు రోజురోజుకూ పేట్రేగి పోతన్నాయి. చిన్నారుల నుంచి పెద్దల వరకు కరుస్తున్న ఘటనలు భయాందోళనకు గురిచేస్తున్నాయి. కుక్క కాటుకు వ్యాక్సిన్లతో కొందరు ప్రాణాలు దక్కించుకుంటున్నప్పటికీ.. లైట్ తీసుకున్న కొందరు ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితి. లేటెస్టుగా హైదరాబాద్ లో రేబిస్ వ్యాధితో వ్యక్తి చనిపోవడం కలకం రేపింది.
వివరాల్లోకి వెళ్తే.. దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో రేబిస్ వ్యాధితో వ్యక్తి మృతి చెందాడు. బౌరంపేట్ లో వారం రోజుల క్రితం రాజు అనే వ్యక్తిని వీధి కుక్క కరిచింది. శరీరమంతా ఇన్ఫెక్షన్ సోకి రేబిస్ వ్యాధితో తీవ్ర అస్వస్థత గురయ్యాడు. హాస్పిటల్ లో చికిత్స పొందుతూ 2026 సెప్టెంబర్ 30వ తేదీన మృతి చెందాడు. దీంతో కుటుంబ సభ్యులు గుండెలు పగిలేలా రోధిస్తున్నారు.
ఇటీవల కుక్కలు దాడి చేస్తున్న ఘటను పెరిగిపోతున్నాయి. వీధి కుక్కలను నిర్మూలించాలని కొందరు డిమాండ్ చేస్తుండగా.. వాటిని రక్షించాలని జంతు ప్రేమికులు కోరుతున్నారు. ఈ క్రమంలో వీధి కుక్కలకు వ్యాక్సినేషన్ సరైన మార్గం అని భావించినప్పటికీ.. అది పూర్తిస్థాయిలో అమలు కాకపోవడంతో ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి.
ALSO READ : కోదాడలో ఆర్టీసీ బస్సులో భారీ చోరీ…
కుక్క కరిచిన వెంటనే వ్యాక్సినేషన్ తీసుకోవాలని డాక్టర్లు చెబుతున్నారు. కుక్క కాటును లైట్ తీసుకోవద్దని.. వైద్యం ఆలస్యమైనా ప్రమాదమేనని హెచ్చరిస్తున్నారు.