బోండాలు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాల్లోకి వెళ్లితే.. పెరుగు 1/4 కప్పు, జీలకర్ర 1/4 టీస్పూన్, గోధుమ పిండి లేదా మైదా పిండి 1 కప్పు, బియ్యప్పిండి 1 టీస్పూన్, నీళ్లు, ఉప్పు రుచికి సరిపడా, అల్లం, ఉల్లిపాయ,కరివేపాకు, వంట సోడా, నూనె, పచ్చి మిర్చీ, కారం.
కారంగా, రుచిగా ఉండే బోండా తయారీలోకి వెళ్లితే.. ముందుగా ఒక మిక్సీ బౌల్ తీసుకోవాలి. అందులో పావు కప్పు పెరుగు, జీలకర్ర, వేసి బాగా కలపాలి. తర్వాత అందులో గోధుమ పిండి లేదా మైదా పిండి వేసి మంచిగా కలుపుకోవాలి. ఒక స్పూన్ బియ్యం పిండి, కొన్ని నీళ్లు పోసి మంచిగా కలిపి , దాదాపు గంట సేపు పిండిని పక్కన పెట్టుకోవాలి. ఇలా చేయడం వలన బోండాలు మంచిగా వస్తాయి.
ఇప్పుడు మనం పక్కన పెట్టిన పిండిని తీసుకోవాలి. అందులో కొంచెం కారం, పచ్చి మిర్చి ముక్కలు, తరిగిన అ్లలం, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, చిటికెడు వంట సోడా, నూనె, కొత్తిమీర వేసి బాగా కలపాలి.మీరు ఎంత మంచిగా కలిపితే పిండి అంత మంచిగా టేస్టీగా రుచికరంగా వస్తుంది. అందువలన మీరు పిండిని బాగా , బోండా తయారు చేసే విధానంలో కలుపుకోవాలి.
ఇప్పుడు డీప్ ఫ్రై కోసం స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టాలి. అందులో సరిపడ నూనె వేసి వేడి చేయాలి. తర్వాత మీరు చిన్న చిన్న బోండాలను నూనెలో వేసుకొని మంచిగా కాల్చుకోవాలి. నూనె ఎక్కువగా పట్టకుండా మొత్తం బంగారు రంగులో వచ్చే వరకు, లోపల పిండిలా ఉండకుండా మంచిగా కాల్చుకోవాలి.
బాగా కాలిన తర్వాత బోండాలను తీసుకొని పక్కన పెట్టుకోవాలి. అంతే టేస్టీ టేస్టీ రుచికరమైన బోండాలు రెడీ. ఇక వీటిని పల్లీల చట్నీ, కొబ్బరి చట్నీ ఎలా తిన్నా రుచి చాలా అద్భుతంగా ఉంటుంది అని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.




