Reading Time: < 1 minute
Telugu Film Federation Protest Jani Master Vallabhaneni Anil Row

తెలుగు ఫిల్మ్ డాన్సర్స్ అసోసియేషన్ వివాదంలోకి ఇప్పుడు తెలంగాణవాదులుగా చెప్పుకుంటున్న కొంతమంది ఎంటర్ అయ్యారు. ఈరోజు జానీ మాస్టర్‌కు సహాయ నిరాకరణ కొనసాగించాలంటూ తెలుగు ఫిల్మ్ ఫెడరేషన్ ఒక లేఖ విడుదల చేసింది.

ఈ క్రమంలో, అసలు ఆంధ్రా ప్రాంతానికి చెందిన వల్లభనేని అనిల్ తెలుగు ఫిల్మ్ ఫెడరేషన్‌కు అధ్యక్షుడిగా ఎలా ఉంటాడు? అతన్ని ఆ పదవి నుంచి తొలగించాలంటూ కొంతమంది ఫిల్మ్ ఛాంబర్ వద్దకు వచ్చి నిరసన వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది.

చాలా సమయం పాటు ఈ నిరసన కొనసాగగా, చివరికి వారికి సుమలత వర్గం మద్దతు పలికినట్లుగా తెలుస్తోంది. చివర్లో ఎంట్రీ ఇచ్చిన సుమలత వారికి మద్దతు పలుకుతూ, వల్లభనేని అనిల్‌ని సస్పెండ్ చేయాలంటూ, జానీ మాస్టర్ మీద విధించిన సహాయ నిరాకరణను ఎత్తివేయాలంటూ ఆమె డిమాండ్ చేసినట్లుగా తెలుస్తోంది. ఇక ఈ క్రమంలోనే, తెలుగు ఫిల్మ్ ఫెడరేషన్‌‌కు సంబంధించి కొత్త అధ్యక్షుడిని కూడా ఎన్నుకోవాలంటూ కొంతమంది తెలంగాణవాదులుగా చెప్పుకుంటున్న వారు డిమాండ్ చేసినట్లుగా చెబుతున్నారు. అయితే, ఈ విషయం మీద పూర్తి సమాచారం అందాల్సి ఉంది.