
న్యూఢిల్లీ: భారత్, పాకిస్థాన్ జట్ల మధ్య జరగనున్న ఆసియా క్రీడల పురుషుల క్రికెట్ ఫైనల్ మ్యాచ్‌కు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు చైర్మన్ మొహ్సిన్ నఖ్వీ హాజరుకావడం లేదు. ఏసియన్ క్రికెట్ కౌన్సిల్ ఈ విషయాన్ని అధికారికంగా ధృవీకరించింది. ముందస్తు షెడ్యూల్ కారణంగా ఇండియా, పాక్ ఫైనల్ మ్యాచ్‌కు నఖ్వీ హాజరు కావడం లేదని తెలిపింది.
స్వర్ణ పతకం కోసం ఫైనల్లో తలపడే జట్లకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. కాగా, శనివారం (అక్టోబర్ 3) ఆసియా క్రీడల మెన్స్ క్రికెట్ ఫైనల్లో చిరకాల ప్రత్యర్థులు ఇండియా, పాకిస్థాన్ జట్లు తలపడనున్న విషయం తెలిసిందే. ఈ హై ఓల్టేజ్ మ్యాచ్ కోసం ఇండియా, పాక్ ఫ్యాన్సే కాకుండా యావత్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులు ఎదురుచూస్తున్నారు.
నఖ్వీ చేతుల మీదుగా మెడల్స్ స్వీకరణకు భారత్ నిరాకరణ..!
2025, ఏప్రిల్‌లో జమ్మూ కశ్మీర్లో జరిగిన పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్, పాకిస్థాన్ మధ్య సంబంధాలు పూర్తిగా క్షీణించాయి. ఈ టెర్రర్ ఎటాక్‌లో మరణించినవారికి నివాళిగా, ఆపరేషన్ సింధూర్‌లో అద్భుత ధైర్యసాహసాలు ప్రదర్శించిన భారత సైన్యానికి మద్దతుగా పాకిస్తాన్‌కు చెందిన మొహ్సిన్ నఖ్వీ చేతుల మీదుగా ట్రోఫీలు అందుకునేందుకు టీమిండియా మెన్స్, ఉమెన్స్ క్రికెట్ జట్లు నిరాకరించాయి.
ఇందులో భాగంగానే ఆసియా కప్ విజేతలుగా నిలిచినప్పటికీ నఖ్వీ చేతుల మీదుగా భారత జట్లు ట్రోఫీలు తీసుకోలేదు. అయితే, ఆసియా క్రీడల నిబంధనలు మాత్రం మాత్రం వేరు. ఒకవేళ ఆసియా క్రీడల్లో భారత్ గెలిస్తే ఏసీసీ చీఫ్ హోదాలో నఖ్వీ చేతుల మీదుగా తప్పక మెడల్ తీసుకోవాల్సిందే.
దీంతో భారత్ అతడి చేతుల మీదుగా మెడల్ స్వీకరిస్తుందా.. లేదా అన్న ఉత్కంఠ నెలకొంది. ఈ తరుణంలో నఖ్వీ ఆసియా క్రీడల మెన్స్ క్రికెట్ ఫైనల్ మ్యాచ్‌కు హాజరు కాకపోవడం గమనార్హం. దీంతో భారత్‌కు లైన్ క్లియర్ అయ్యింది. ఇండియా గోల్డ్ మెడల్ గెలిచిన ఇతరుల చేతుల మీదుగా స్వీకరిస్తోంది.