Reading Time: < 1 minute
Jani Master Non Cooperation Telugu Film Employees Federation

Jani Master: ప్రముఖ డాన్స్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌పై తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ కీలక నిర్ణయం తీసుకుంది. ఆయనపై సహాయ నిరాకరణ (Non-Cooperation) కొనసాగించాలని ఫెడరేషన్ తమ అనుబంధ సంఘాల జనరల్ సభ్యులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు సెప్టెంబర్ 26, 27 తేదీల్లో జరిగిన ఆల్ ఇండియా ఫిల్మ్ ఎంప్లాయీస్ కాన్ఫెడరేషన్ (A.I.F.E.C.) సమావేశంలో ఈ అంశంపై సుదీర్ఘంగా చర్చించినట్లు ఫెడరేషన్ తన లేఖలో పేర్కొంది. గతంలో జరిగిన పరిణామాలపై ఫెడరేషన్ నాయకులందరితో సమగ్రంగా చర్చించి, ఫెడరేషన్ సభ్యుల ప్రయోజనాలను కాపాడటానికి, వారికి ఎలాంటి అన్యాయం జరగకుండా ఉండేందుకే జానీ మాస్టర్‌పై నాన్-కోఆపరేషన్ నిర్ణయం తీసుకున్నట్లు వివరించింది. A.I.F.E.C. సమావేశంలో కూడా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ తీసుకున్న ఈ నిర్ణయానికి పూర్తి మద్దతు లభించిందని తెలిపింది. ఫెడరేషన్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని అనుబంధ సంఘాలు, నాయకులు, సభ్యులందరూ తప్పనిసరిగా పాటించాలని సూచించింది. వ్యక్తిగత స్వార్థం, స్వలాభం కోసం ఫెడరేషన్ నిర్ణయాలను ఎవరైనా ఉల్లంఘిస్తే ఉపేక్షించేది లేదని హెచ్చరిస్తూ, జానీ మాస్టర్‌పై సహాయ నిరాకరణను కచ్చితంగా అమలు చేయాలని ఆదేశించింది.

Whatsapp Image 2026 09 30 At 1.17.59 Pm