Reading Time: 2 minutes
The Paradise: మస్త్ చేశావయ్యా..! కేసీఆర్ పాత్రలో జీవించావు..! ప్రియదర్శిని అభినందించిన హరీశ్ రావు

నటుడు ప్రియదర్శి మాజీ మంత్రి, బీఆర్ఎస్ శాసనసభాపక్ష ఉపనేత హరీశ్ రావుని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. తాను నటించిన ప్యారడైజ్ సినిమా గురించి అలాగే సినిమాలో ఆయన నటించిన శంకరన్న పాత్ర గురించి హరీష్ రావుతో ముచ్చటించారు ప్రియదర్శి, ఈ సందర్భంగా ప్రియదర్శి ఆయన సినీ ప్రయాణం, భవిష్యత్ ప్రాజెక్టులపై కూడా కొద్దిసేపు ఆత్మీయంగా మాట్లాడారు. ఆత్మగౌరవం, అస్తిత్వం కోసం జరిగే పోరాటాలు ఒక జాతి విముక్తికి ఎలా స్ఫూర్తినిస్తాయో.. మనం తెలంగాణ సాధనలో చూశామని ఈ సందర్భంగా హరీశ్ రావు గుర్తుచేశారు. ఒక జాతి గుర్తింపు కోసం జరిగిన పోరాటాన్ని ఇటీవల వచ్చిన ప్యారడైజ్ సినిమాలో అద్భుతంగా ఆవిష్కరించారని, ఆ పోరాట స్ఫూర్తికి ప్రతీకగా నిలిచిన తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పాత్రలో ప్రియదర్శి జీవించారని ఆయన కొనియాడారు.

అలాంటి హీరోయిన్‌ మరొకరు ఉండరు.. అందం, గుణం కలబోసిన నటి.. ఆమె కోసమే ఆ సినిమాను 60, 70సార్లు చూశా

కేసీఆర్ హావభావాలు, నడక, మాట తీరును పట్టుకోవడం చాలా కష్టమని.. కానీ, ఆ పాత్రలో ప్రియదర్శి పరకాయ ప్రవేశం చేసి అత్యంత సహజంగా నటించారని ప్రశంసించారు. ఆ పాత్ర ద్వారా ప్రియదర్శి ప్రజలకు చాలా బలంగా కనెక్ట్ అయ్యారని అభినందించారు. ప్యారడైజ్ సినిమా బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ యాసకు, మన పల్లె కథలకు ప్రియదర్శి కేరాఫ్ అడ్రస్‌గా మారారని హరీశ్ రావు అన్నారు. గతంలో వచ్చిన ‘మల్లేశం’ సినిమా ద్వారా తెలంగాణ చేనేత కార్మికుల కష్టాలను, ‘బలగం’ సినిమాతో మన పల్లె సంస్కృతిని, కుటుంబ బంధాలను ప్రపంచానికి అద్భుతంగా చాటిచెప్పారని గుర్తుచేశారు.

విరాట్ కోహ్లీ నా బావ.. షాకింగ్ విషయం చెప్పిన టాలీవుడ్ హీరోయిన్.. షాక్‌లో అభిమానులు

ఎలాంటి సినీ నేపథ్యం లేకుండా వచ్చి.. తన స్వయంకృషితో మట్టి కథలను మోసే అద్భుతమైన నటుడిగా ప్రియదర్శి ఎదగడం తెలంగాణకే గర్వకారణం అన్నారు. తెలంగాణ సినిమా, సంస్కృతిని మరింత ముందుకు తీసుకెళ్లేలా ఆయన భవిష్యత్తులో మరెన్నో గొప్ప ప్రాజెక్టులు చేయాలని హరీశ్ రావు  ఆకాంక్షించారు. మాజీ మంత్రి హరీశ్ రావుకి నటుడు ప్రియదర్శి ఈ సందర్భంగా ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. నిత్యం ప్రజల మధ్య ఉంటూ, ప్రజల కోసం పాటు పడే నాయకుడిగా పేరు సంపాదించడం వెనుక ఎంతో కృషి దాగి ఉందని హరీశ్ రావు పట్ల తన అభిమానాన్ని వ్యక్తం చేశారు.

నువ్వేమైన పెద్ద హీరోయిన్‌వా.., అందగత్తెవా అంటూ అవమానించారు.. కట్ చేస్తే 150కుపైగా సినిమాలు

 

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.